Disqualification Row: ఏపీ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ.. ఆ ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు వేస్తుందా?

Disqualification Row: ఏపీలో ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ పిఠాయించడం పట్ల వారిపై ప్రధాన పార్టీలు అనర్హత వేటు వేసిన సంగతి మనకు తెలిసిందే. ఇంకా ఈ అనర్హతపై తీవ్రస్థాయిలో ఉత్కంఠత కొనసాగుతుంది. నేడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను విచారణకు హాజరుకావాలని నోటీసులను పంపించగా కారణాలు చెబుతూ సదురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విచారణకు హాజరు కాకపోవటం గమనార్హం.

ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తుది విచారణకు హాజరు కావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్లు నోటీసులను పంపించారు.అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం ఎప్పటిలాగే ఈ సారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ నోటీసులు ప్రకారం ఈరోజు మధ్యాహ్నం టిడిపి రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది అనంతరం వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీకి పిఠాయించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా విచారణలో పాల్గొనాల్సి ఉంది.

తమ అనర్హత పిటిషన్ కు సంబంధించినటువంటి పిటీషనర్ సమర్పించిన వీడియో ఆధారాలు ఒరినల్ అని వాటిని నిరూపించాల్సిన అవసరం ఉంది అంటూ ఎమ్మెల్యేలు గతంలో చెప్పిన విధంగానే ఈసారి కూడా చెబుతున్నారు. ఇక ఈ విచారణకు తాము హాజరు కాలేమంటూ ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే నోటీసుకు బదులు పంపినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలి అంటూ అసెంబ్లీ చీఫ్ విప్ మదనూరి ప్రసాదరాజు, మండలిలో చీప్ విప్ మేరీగా మురళీధర్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వెళ్లినటువంటి వీరిపై కేటాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలి అయితే సదరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను విచారించిన అనంతరం వారిపై నమోదు చేసిన అనర్హత వేటు విషయం గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు రాకపోవటంతో అనర్హత వేటు విషయంపై ఉత్కంఠత నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -