Pakistani: భార్య కోసం సరిహద్దులు దాటిన పాకిస్థానీ.. హైదరాబాద్ లో అంతకాలం నుంచి నివాసం ఉంటున్నాడా?

Pakistani: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం ప్రాణానికి తెగించి భారతదేశంలో అడుగుపెట్టిన ఒక భర్త ఉదంతం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ పాకిస్తానీ హైదరాబాద్ రావటం వెనుక కేవలం భార్య మాత్రమేనా లేక అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తున్నారా అని పరిశోధన మొదలుపెట్టారు పోలీసులు. ఇంతకీ జరిగిందేంటంటే పాకిస్తాన్ లోని ప్రావిన్స్ కి చెందిన ఫయాజ్ అహ్మద్ 2018 లో ఉపాధి కోసం షార్జా వెళ్ళాడు.

అక్కడే ఒక వస్త్ర పరిశ్రమలో పనికి కుదురుకున్నాడు. ఇక హైదరాబాదులోని బహుదూర్ పురాకు చెందిన నేహా ఫాతిమా కూడా ఉపాధి కోసం షార్జాకి వెళ్ళింది. అక్కడ ఫయాజ్ సాయంతోనే వస్త్ర పరిశ్రమలో ఉద్యోగం సంపాదించింది. అలా పరిచయమైన వారిద్దరి స్నేహం తర్వాత ప్రేమగా మారి 2019లో అక్కడే పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ తరువాత ఫయాజ్ పాకిస్తాన్ వెళ్ళిపోగా ఫాతిమా హైదరాబాద్ తిరిగి వచ్చేసింది.

 

ఆ తర్వాత కొంతకాలానికి ఫాతిమా తల్లిదండ్రులు పాకిస్తాన్ లోని ఫయాజ్ ని సంప్రదించి ఇండియా వచ్చేయటానికి అతనిని ఒప్పించారు. ఇక్కడ ఉండేందుకు కావలసిన గుర్తింపు పత్రాలు తానే ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫయాజ్ పాకిస్తాన్ నుంచి నేపాల్ వెళ్ళాడు. అతడిని కలుసుకోవటానికి ఫాతిమా తల్లిదండ్రులు నేపాల్ వెళ్లారు. మరికొందరు సాయంతో అతడిని హైదరాబాద్ తీసుకువచ్చి కిషన్ బాగ్ లో నివాసం ఏర్పాటు చేసి కాపురం పెట్టించారు.

 

అయితే అతనికి ఆధార్ కార్డు ఇప్పించి స్థానికుడిలా చలామణి చేసేందుకు ప్రయత్నించారు ఆ తల్లిదండ్రులు. మాదాపూర్ లోని ఒక ఆధార్ కేంద్రానికి వెళ్లి ఫయాజ్ ను తన కుమారుడు మహమ్మద్ గౌస్ గా పరిచయం చేసి ఆధార్ కార్డు పొందేందుకు ట్రై చేశారు. అయితే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకి చెప్పడంతో వారు నిందితుడు ఫయాజ్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని పాస్పోర్టు డేట్ కూడా ముగిసినట్లు గుర్తించారు. అయితే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్, అఫ్జల్ బేగం మాత్రం పరారీలో ఉన్నారు. అయితే దీని వెనక కుటుంబ కథ మాత్రమే ఉందా లేదంటే కుట్రకోణం ఏమైనా ఉందా అని తెలుసుకునేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -