Nizamabad: స్ట్రెచర్ లేక కొడుకును ఈడ్చుకెళ్లిన తల్లీదండ్రులు.. అలా జరగడంతో?

Nizamabad: తెలంగాణలోఆస్పత్తులు ఎంతో అభివృద్ధి చెందాయని రోగులకు ఏవిధమైనటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ గత మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ లోని ఆసుపత్రులతో పోలుస్తూ తెలంగాణ ఆసుపత్రులను ఎంతో గొప్పగా పొగడారు. అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు మర్చిపోకముందే తెలంగాణలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరిని ఎంతగానో కలిసి వేస్తుంది.పక్కకు కదలలేని స్థితిలో ఉన్నటువంటి పేషెంట్ కోసం ఆసుపత్రిలో కనీసం స్ట్రక్చర్ కూడా లేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇలా ఆసుపత్రిలో పేషంటును తీసుకెళ్లడం కోసం స్ట్రక్చర్ లేకపోవడంతో ఆ పేషెంట్ తల్లిదండ్రులు తనని కాళ్లు పట్టి లాకెళ్లినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతిపక్ష నేతలు ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈ ఒక్క ఘటన చాలు తెలంగాణలో ప్రభుత్వం తీరు ఎలా ఉందో చెప్పడానికి అంటూ పెద్ద ఎత్తున ఎద్దేవా చేస్తున్నారు.ముందు మన రాష్ట్రంలో ఆసుపత్రులను చక్కదిద్ది పక్క రాష్ట్రాల ఆసుపత్రుల గురించి మాట్లాడాలని మంత్రి హరీష్ రావుకు సూచిస్తున్నారు.

ఈ క్రమంలోనే పలువురు నేటిజన్స్ ఈ ఘటనపై స్పందిస్తూ ఈ ఘటన గురించి మంత్రి హరీష్ రావు ఒకసారి స్పందించి మాట్లాడాలని కోరారు.ఇక ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయంపై స్పందించారు. వారికి టోకెన్ వచ్చిందన్న తొందరలో ఇలా పేషెంట్ ని లాకెళ్లి తీసుకెళ్లారని ఇందులో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఏమాత్రం లేదు అంటూ ఆస్పత్రి సూపరిండెంట్ ఈ విషయంపై స్పందించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ మేనిఫెస్టో మోసాలు.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేశారా?

CM Jagan:  జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిది అని చెబుతూ ఉంటారు అయితే ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో పథకాలను అమలు పరచలేదు అయితే ఇలాంటి...
- Advertisement -
- Advertisement -