Lord Shani Dev: కీడు పనులు జరగడానికి శని దేవుడు కారణమా..?

Lord Shani Dev: సాధారణంగా శని దేవుడు శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతుంటారు. శని దేవుడిని తిట్టుకుంటూనే ఉంటారు. అలా తిట్టుకోవడం తప్పని.. అలాంటి అభిప్రాయం సరికాదు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే శని దేవుడు అపారమైన మహాశివ భక్తుడు. అప్పుడప్పుడు అనుకున్న పనులు కాకపోవడం, చెడు జరగడం మనసులో శంకించడం లాంటి జరుగుతున్నప్పుడు ఇలా జరగడానికి కారణం శని దేవుడే అంటూ ముందుగా శనిదేవుడిని శపించడం మొదలు పెడుతారు.

కానీ మనం చేసే మంచిపనులే మనకు శ్రీరామరక్ష అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇలా కీడు పనులు జరగడానికి ఇబ్బందులు తలెత్తడానికి శని దేవుడే కారణామా? అసలు అలా ఎందుకు చేస్తాడు అని చాలా మందికి సందేహాలు తలెత్తుతుంటాయి. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట, లగ్నంలో చంద్రుడితో, చంద్రుడికి తర్వాత రెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిననాటి శని ఆరంభమైనట్టే చెప్పవచ్చు. అలాగే శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది.

అలాగే మనం చేసిన తప్పులకు వారి కర్మ ఫలం అనుభవించక తప్పదు. అయితే శని దేవుడు అంటే భయపడి పూజించని వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ శని దేవుడిని ఆయనను భక్తిశ్రద్ధలతో వేడుకోవడం వల్ల కూడా ఆయన సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలిగేలా కూడా దీవిస్తాడు. దానాలు, ధర్మాలు, సత్కార్యాలు సత్కాలక్షేపాలు చేస్తే అలాంటి వారికి శని దేవుడు మేలు చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. చెడు పనులు, కీడు పనులు, అనుకున్నది జరగగపోవడం లాంటికి శని దేవుడు కారణం కాదని వివిధ గ్రంథాలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -