Shani: శనివారం రోజు ఇవి క‌నిపించాయా.. శని దేవుని అనుగ్రహం మీపై ఎలా ఉంటుందో తెలుసా?

Shani: సాధారణంగా శని దేవుడు అంటే అందరూ భయపడతారు. అందుకు కారణం కూడా ఉంది. ఆయన దృష్టి మన మీద పడిందంటే ఇంకా నామరూపాలు లేకుండా పోతాం. అలా అని శని దృష్టి అందరి మీద పడదు. ఆయా గ్రహబలాన్ని బట్టి ఆయా రాశుల వారి మీద మాత్రమే శని ప్రభావం ఉంటుంది. అయితే శనివారం శని దేవునికి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజు మీకు వీళ్లు కనిపిస్తే మీరు అదృష్టవంతుల కింద లెక్క. అవేమిటో చూద్దాం.

శనివారం పూట ఉదయాన్నే ఎవరైనా వ్యక్తులు భిక్షాటన చేస్తూ ఇంటికి వస్తే అది మీకు రాబోయే శుభసూచకంగా భావించాలి. ఒకవేళ యాచకులు మీ ఇంటికి రాకపోయినా.. మీ కంటికి కనిపించినా అదృష్టమే. ఇలాంటి సమయాల్లో వారికి తగినంత సహాయం చేయండి. అలాగే శనివారం పూట మీ ఇంటి దగ్గర కానీ చుట్టుపక్కల గాని ఎవరైనా రోడ్లు ఊడ్చేవాళ్ళు కనిపిస్తే అది మహా శుభం. అలాంటి వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేయండి.

 

ఇలా చేయడం వలన శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. చాలామంది నలుపు వస్తువులు ఏమైనా కనిపిస్తే అశుభం గా భావిస్తారు. అయితే శని దేవునికి నలుపు రంగు ఎంతో ప్రీతి కాబట్టే శనివారం రోజు నల్ల కుక్కని మీరు చూసినట్లయితే మీకు అదృష్టం పట్టబోతుందని భావించాలి. దానికి ఆహారం పెట్టాలి. ఆవనూనెతో తయారుచేసిన రొట్టెని నల్ల కుక్కకి ఆహారంగా ఇస్తే చాలా మంచిది.

 

ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, వాణిజ్య రంగాలలో కీర్తి చేకూరాలంటే శని దేవుని అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారికి శని అనుగ్రహం తప్పనిసరి. శనివారాలలో కానీ శని దశ నడుస్తున్న రోజులలో భక్తులు ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసినా.. లేదంటే శనివారం వ్రతం చేసిన చాలా మంచిది. అలాగే జీవితం సాఫీగా సాగాలంటే 23 వేల సార్లు శని నామం జపం చేయాలని పెద్దలు చెప్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -