Shani Dev: శనిదేవుడిని ఈ విధంగా పూజిస్తే చాలు.. డబ్బే డబ్బు?

Shani Dev: శనీశ్వరుడిని న్యాయ దేవుడు, కర్మదాత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు మనం చేసే పనులను బట్టి శుభ,అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మనం తప్పుడు పనులు చేస్తే శనీశ్వరుడు కష్టాలను పెట్టడంతో పాటు శిక్షిస్తాడు. శనీశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ మంచి పనులు చేసే వారికి శనీశ్వరుడు అష్టైశ్వర్యాలను ఇస్తాడు. అయితే శనీశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజించడం మంచిదే. చాలామంది శనివారం శనీశ్వరుని ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.

అయితే కొంతమంది శని దేవుడిని పూజించడానికి గుడికి వెళ్లడానికి భయపడితే మరికొందరి మాత్రం శనీశ్వరుడి అనుగ్రహం కలగాలని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శని దేవుని అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా కూడా సంపన్నులు అవుతారు. అందుకే మన పెద్దలు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలని చెబుతూ ఉంటారు. శని దేవుడి కరుణ ఉన్న వాళ్లు అన్ని రకాలుగా సుఖసంతోషాలను పొందుతారు. అయితే శనీశ్వరుని అనుగ్రహం కోసం చాలామంది ఎన్నో రకాల దానధర్మాలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.

 

కాని శనికి ఎంతో ఇష్టం అయినా అపరాజిత పుష్పంతో శనిదేవుడి పూజించడం వల్ల ఆయన ప్రసన్నుడు అవుతాడు. అపరాజిత నీలి పుష్పాన్ని ఎవరైతే సమర్పించి, శని దేవుడిని పూజిస్తారో వారిని శని దేవుడు అనుగ్రహిస్తాడు. దాంతో జీవితంలో శని ప్రభావం తగ్గి అనుకున్న అన్ని పనులు విజయవంతం అవుతాయి.అపరాజిత పుష్పం అటు విష్ణు భగవానుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఇంట్లో లేదంటే ఇంటి ఆవరణలో అపరాజిత మొక్కను పెంచుకోవడం, దాని నుండి వచ్చే పుష్పలను శని దేవుడికి సమర్పించి పూజించడం వల్ల అంతా శుభం కలుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -