Heart Attacks: ఆ కారణమే చిన్న వయసులో గుండెపోటుకు దారి తీస్తోందంట!

Heart Attacks:  నేటి కాలంలో వ్యాపిస్తున్న వివిధ రకాల వ్యాధులు వయస్సుకు సంబంధం లేకుండా వచ్చేవి. పూర్వం ఒక వయస్సు దాటితే ఫలన వ్యాధి వచ్చేది అనేవారు. కానీ.. నేడు ఏ వ్యాధి ఏ వయస్సు వారికి వస్తోందో తెలియడం కష్టంగా మారింది. గతంలో వయస్సుపైబడిన వారికి అది కూడా పద మందిలో ఒక్కరికో ఇద్దరికో హార్ట్‌ఎటాక్‌ వచ్చేది. ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం హార్ట్‌ వస్తోంది. మన మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకం కలిగినప్పుడు స్ట్రోక్‌ వస్తుంది. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత మెదడులోని కణాలు ఒక్కొక్కటిగా చనిపోవడం ప్రారంభిస్తాయి. స్ట్రోక్‌ అనేది నయం చేయలేని.. పాణాంతక పరిస్థితి.

వివిధ అలవాట్లు మనిషి రక్త నాళాలలో అడ్డంకులు కలిగిస్తాయి.. ఇదే గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారి తీస్తోంంది. అందులో ఆరోగ్యానికి హానీచేసే ఆహారపు అలవాట్లు పేద జీవనశైలి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న మరణ ప్రమాదాన్ని పెంచుతాయి.

ప్రెజర్‌..(ఒత్తిడి)

అధిక ప్రెజర్‌కు గురైతే గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిప్రెషన్‌ వివిధ కారణాల వల్ల వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఏదైనా సందర్భంలో, మనిíషి చాలా కాలంగా నిరాశకు గురైనట్లయితే, అది అధిక రక్తపోటు లేదా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ఒత్తిడికి గురికాకుండా వాటిని పరిష్కరించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉప్పు అధికంగా ఉండే ఆహారంతో..

అధికంగా ఉప్పు ఉండే ఆహారం తీసుకోవడం లేదా సోడియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకునే వారికి స్ట్రోక్, లేదా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయంట. ఉప్పగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడంతో రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్ట్రోక్‌ లేదా హార్ట్‌ ఎటాక్‌ కేసులకు ప్రధాన కారణం ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడమే.

యాక్టివ్‌గా లేకపోవడం..

శారీరకంగా చురుగ్గ ఉండటంతో రక్త ప్రసరణ పెరిగి గుండె «ధృడంగా ఉంటుంది. కనుక ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలైన వ్యాయామం చేయాలంటారు వైద్యులు. చాలా మంది బయటకు వెళ్లలేక వ్యాయామానికి దూరం అవుతున్నారు. దీకి కారణంగా కూడా గుండెపోటుకు గురవుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అలాంటి వ్యాధి మీ దరికి చేరదు.

మద్యం తాగడం..

మద్యం వినియోగం మితిమీరిన మద్యపానం వంటి ఆల్కహాల్‌ వినియోగం ఒక వ్యక్తి యొక్క స్ట్రోక్‌ లేదా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. నిజానికి ఆల్కహాల్‌ 1725 నుండి స్ట్రోక్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువ ఆల్కహాల్‌ తాగడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. మరియు రోజుకు ఒకటి నుండి రెండు పానీయాలు తాగడం వల్ల మీ గుండెపోటు ప్రమాదాన్ని 10 – 15 శాతం పెంచవచ్చు.

పోగ తాగడం..

పొగ ఎక్కువగా తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. సిగరెట్‌లోని పొగాకు ధమనులను మూసేసి మెదడు, గుండెకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. సిగరెట్‌లోని నికోటిన్‌ రక్తపోటును పెంచుతుందని, రక్తం గట్టిపడుతుందని మరియు ధమనులలో ఫలకం పెరిగిందని కూడా ఒక అధ్యయనం కనుగొంది. ఒక వ్యక్తి సిగరెట్‌ తాగిన ప్రతిసారీ అతని శరీరంలోకి 5,000 రసాయనాలు వెళ్తాయి. రసాయనాలలో ఒకటి కార్బన్‌ మోనాక్సైడ్‌. ఇది ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తుంది మరియు గుండెకు హాని కలిగిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -