Nagarjuna: కొడుకుల కెరీర్ ను చక్కబెట్టలేని నాగ్ వాళ్ల కెరీర్ ను బాగు చేస్తారా?

Nagarjuna: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నటువంటి వారిలో అక్కినేని హీరోలు ఒకరు. ముఖ్యంగా నాగచైతన్య డేటింగ్ వార్తలు అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన నటి శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా తమ వ్యక్తిగత కారణాలవల్ల తరచూ వార్తలో నిలుస్తున్న తరుణంలో అక్కినేని నాగార్జున అమల తీసుకున్నటువంటి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని నటీనటులుగా తాము తమ టాలెంట్ నిరూపించుకోవాలని ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. అయితే చాలామందికి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవడానికి సరైన మార్గం తెలియక వారిలో దాగి ఉన్న టాలెంట్ బయట పెట్టలేకపోతున్నారు. అయితే ఇలా నటనపై ఆసక్తి ఉన్నవారికి నాగార్జున అమల అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు.

ద నెక్స్ట్ బిగినింగ్ అని ఓ కార్యక్రమం పేరుతో అమల నాగార్జున టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఇలా నటనపై ఆసక్తి ఉన్నవారు ఈ వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్ కు అప్లై చేసి తదుపరి ప్రాసెస్ ఫాలో కావాలని తెలిపారు.ఇలా కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటూ నాగార్జున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో పై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి చైతన్య అఖిల్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ హీరోలు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పలువురు స్పందిస్తూ ఇంట్లో కొడుకుల కెరియర్ చక్కదిద్దలేదు కానీ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తారా.. వారిని చక్కదిద్దుతారా అంటూ కాస్త వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -