Nandamuri Suhasini: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి నందమూరి సుహాసిని.. ఈ ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదంటూ?

Nandamuri Suhasini: తెలంగాణ ఎన్నికలలో భారీ స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. ఎంతో మంది కీలక నేతలు తమ పార్టీలకు గుడ్ బై చెబుతూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతోమంది కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు కాషాయం పార్టీకి కూడా సెలవు ప్రకటిస్తూ హస్తం పార్టీ చెంతకు చేరుతున్నారు. ఇలా కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటం విశేషం.

ఇదిలా ఉండగా తాజాగా నందమూరి సుహాసిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్ప గుచ్చం అందచేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రేవంత్‌కు సుహాసిని పుష్పగుచ్చం అందజేశారు. ఈమెతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని ఫిక్స్ అయిన తర్వాతనే ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది.

ఈ విధంగా నందమూరి సుహాసిని గతంలో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే 70 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఇలా టిడిపి బలోపేతానికి కృషి చేసినటువంటి ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అయితే ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కనుక కీలక పదవి ఖాయమైనని తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ లేదా గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారట.

ఈ విధంగా నందమూరి సుహాసినికి గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయించి ఆమెకు జిహెచ్ఎంసి మేయర్ పదవిని కట్టబెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈమె తన పదవిని ఖరారు చేసుకుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక తెలంగాణలో టిడిపి పార్టీలో ఉన్నటువంటి ఈమె కాంగ్రెస్ పార్టీకి చేరటం అనేది ఎవరు ఊహించినటువంటి అంశమని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -