Chiranjeevi Fans: చిరంజీవిపై అభిమానుల ప్రేమకు నిదర్శనం ఇదే.. ఇంతలా ప్రేమించే ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారా?

Chiranjeevi Fans: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చిరంజీవి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చి తమ సత్తా చాటుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే చిరంజీవి హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు ఇప్పటికే ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేశారు కరోనా సమయంలో కూడా ఎంతో మందికి అండగా నిలిచారు ఇలా సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నటువంటి ఈయనకు అభిమానులు ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

 

ఇకపోతే తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ కి చెందిన కొందరు అభిమానులు ఏకంగా చిరంజీవి ముఖచిత్రంతో గూగుల్ మ్యాప్ తయారు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.గూగుల్ మ్యాప్ లో చిరంజీవి ముఖచిత్రం తయారు చేయడానికి దాదాపు 15 రోజులపాటు శ్రమించారని తెలుస్తుంది.

 

800 కిలోమీటర్ల మేర చెక్ పాయింట్స్ పెట్టుకొని…పదుల సంఖ్యలో చిరు అభిమానులు రకరకాల వాహనాలలో గూగుల్ నావిగేషన్ ఆధారంగా ఆ రూట్లో ప్రయాణించారు. ఆ మెగా అభిమానులు ప్రయాణించిన రూట్లన్నీ కలపగా గూగుల్ మ్యాప్స్ పై మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆవిష్కృతమైంది. ఈ విధంగా చిరంజీవి చిత్రాన్నిగూగుల్ మ్యాప్ లో ఆవిష్కరిస్తూ చిరంజీవిపై తమకు ఉన్నటువంటి అభిమానాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -