SKN: ఎన్టీఆర్ అభిమాని గ్రేట్ కదా.. ఆ ఒక్క మాటకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

SKN: హీరోలు అందరూ ఒకటే అయినా కూడా ఆ హీరోల అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటూ పోట్లాడుకోవడం కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు అభిమానులు అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని బేబీ సినిమా నిర్మాత ఎస్కెఎన్ ఒక మంచి వివరణ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ వీర ఫ్యాన్ గా ఎస్కెఎన్ గురించి తెలిసిందే. అలా అని ఇతర హీరోలను ఇష్టపడకపోవడమో లేదా ట్రోల్ చేయడమో లాంటి వ్యహహారాలు ఉండవు.

ప్రభాస్, రవితేజ లాంటి వాళ్ళకు పిఆర్ గా చేసినప్పుడు ఆ ఇద్దరి ఫాలోయర్స్ తనను ఇష్టపడేవాళ్లు. నిర్మాతగా టాక్సి వాలా రిలీజ్ కు పైరసీకి గురైతే జంగారెడ్డి గూడెం నుంచి ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఫోన్ చేస్తే ఇక్కడ సీడీలు చేసి అమ్ముతున్నారని దగ్గరుండి మరీ పట్టించాడు. అదేంటయ్యా నేను మెగా ఫాన్ అని తెలిసినా హెల్ప్ చేశావని ఎస్కెఎన్ అడిగితే అదేంటన్న మనమందరం తెలుగు హీరోల అభిమానులమేనని హత్తుకునేలా తెలిపారు..
అయినా ఒక హీరోని ప్రేమిస్తే మరో హీరోని ద్వేషించాలని లేదు. ఆ మాటకొస్తే ట్విట్టర్ లో గొడవలు చేసేవాళ్లంతా ఫేక్ ఐడిలతో తమ అసలు ఐడెంటిటీ దాచుకుని రెచ్చగొట్టేవాళ్ళే.

ఆ మాటలకు, చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నుంచి విజయ్ దేవరకొండ దాకా ఎవరు ఎవరినైనా ఇష్టపడవచ్చు కానీ దానికి బదులుగా అవతలి వాళ్ళ మీద బురద జల్లడం కాదు అని తెలిపారు ఎస్కెఎన్. తాజాగా ఎస్కెఎన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ ఇప్పటికైనా అభిమానులు మారితే బాగుంటుంది అని కొందరు కామెంట్స్ చేయగా కొందరు అభిమానులు వారి అభిమాన హీరోలు చెబితేనే ఫ్యాన్స్ విననప్పుడు ఎవరు చెప్పినా కూడా వినరు చెప్పి కూడా వేస్ట్ అంటూ కామెంట్.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -