Chiranjeevi Fans: చిరంజీవి ఫ్యాన్స్ కు ఇంతకు మించి షాక్ ఉంటుందా.. భోళా టికెట్ రేట్లు ఆ రేంజ్ లో పెంచుతున్నారా?

Chiranjeevi Fans: మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్మాతలు ఏపీ ముఖ్యమంత్రికి టికెట్ల రేట్లు పెంపుపై అప్లికేషన్ పెట్టారని తెలుస్తుంది. ఏపీలో టికెట్ పై 25 రూపాయలు చొప్పున పెంచాలని ప్రభుత్వాన్ని అడిగినట్టు తెలుస్తుంది.

త్వరలోనే టికెట్ రేట్ల పెంపుపై జీవో విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ టికెట్ ధరని 295 రూపాయలు పెట్టుకునే వెసులుబాటు ఉంది. కానీ ఏపీలో ఇది 177 రూపాయలకే పరిమితమైంది. అందుకే 25 రూపాయలు చొప్పున పెంపుదల ఉంటే బయ్యర్లకు కూడా సులభంగా రికవరీ అవుతుందని నిర్మాత అనిల్ సుంకర భావించినట్లు తెలుస్తుంది. అందుకే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ఆశ్రయించారని సమాచారం.

 

ఇకపోతే టికెట్ల రేట్లు పెంచమని ఏపీ ప్రభుత్వాన్ని కలవడం పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ కాకపోవడంతోనే ఇలా టికెట్ల రేట్లు పెంచడం వల్ల కొంత మొత్తంలో అయినా రికవరీ అవుతుందన్న ఆలోచనలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి.

 

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించి టికెట్ల రేట్లు పెంచమని వేడుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చినటువంటి పాటలు కానీ లేదా ట్రైలర్ టీజర్ వంటివి గాని ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే జైలర్ ఇతర సినిమాలు కన్నా మెగాస్టార్ చిరంజీవి సినిమానే కాస్త వెనుకబడి ఉంది.ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని టికెట్ల రేట్లు పెంచడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరి ఈ సినిమా విడుదలకు మరో నాలుగు రోజులు ఉండగా ఈ నాలుగు రోజులలో సినిమా పట్ల ఎలాంటి బజ్ ఏర్పడుతుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -