Varsha Bollamma: బెల్లంకొండ గణేష్ తో ప్రేమాయణంపై వర్ష రియాక్షన్ ఇదే!

Varsha Bollamma: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నటువంటి వారిలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇటీవల కాలంలో ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ ఫామ్ లోకి వస్తున్నారు. ఇక త్వరలోనే ఊరి పేరు భైరవకోన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో వర్ష హీరోయిన్ గా నటిస్తున్నారు.

 

ఇక ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్ష ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈమె టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ గతంలో వచ్చిన వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా కంటే ముందుగానే వర్ష బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతి ముత్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన వర్ష తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు కూడా మేమిద్దరం కలిసి బయట తిరగలేదు అలాగే ఒకరి సోషల్ మీడియా పోస్టులకు మరొకరు రిప్లై కూడా ఇచ్చుకోవడం లేదు.

 

ఇలా ఎక్కడ మేము కలిసి కనిపించనప్పుడు మేమిద్దరం ప్రేమలో ఉన్నామనడం అర్థంలేని విషయం అంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు. తను గుడ్ పర్సన్ చాలా మంచి స్నేహితుడు అంటూ ఈమె తన ప్రేమ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలకు పూర్తి క్లారిటీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -