Swathimuthyam Movie Review: స్వాతిముత్యం సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేదీ : అక్టోబర్5, 2022

నటీనటులు : బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, రావు రమేష్, తదితరులు

నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం : లక్ష్మణ్ కె కృష్ణ

సంగీతం : మహతి స్వరసాగర్

సినిమాటోగ్రఫీ : సూర్య

ఎడిటర్ : నవీన్ నూలి

Swathimuthyam Movie Review and Rating 

దసరా పండుగ కానుకగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో చాలామంది హీరోలు తమ సినిమాల షూటింగ్ లు ఇప్పటికే పూర్తైనా ఈ సినిమాలకు పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు మాత్రం బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమాను రిజల్ట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో దసరా కానుకగా ఈరోజే థియేటర్లలో రిలీజ్ చేశారు.

బెల్లంకొండ గణేష్ తొలి సినిమాతోనే హిట్ కొట్టాడా? వరుస విజయాలతో జోరుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఖాతాలో మరో సక్సెస్ చేరిందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సరోగసిలో స్పెర్మ్ డొనేషన్ అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ డ్రామా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. కరెంట్ ఆఫీస్ లో జూనియర్ ఇంజనీర్ గా పని చేసే బాలమురళి(బెల్లంకొండ గణేష్) మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాడు.

బాలమురళికి పెళ్లీడు రావడంతో అతని తండ్రి వెంకట్రావు (రావు రమేష్) పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతాడు. అయితే వేర్వేరు కారణాల వల్ల రావు రమేష్ చూసిన సంబంధాలలో ఏ సంబంధం కూడా కుదరదు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి( వర్ష బొల్లమ్మ) బాలమురళికి తొలి చూపులోనే నచ్చేయగా ఇద్దరికీ పెళ్లి కుదురుతుంది. అయితే పెళ్లిరోజున శైలజ(దివ్య శ్రీపాద) తన బిడ్డకు బాలమురళి తండ్రి అని చెబుతుంది.

బాలమురళి సైతం ఆ బిడ్డకు తానే తండ్రినని ఒప్పుకుంటాడు. బాలమురళి నిజంగా తప్పు చేశాడా? ఆ బిడ్డకు తండ్రినని చెప్పడంతో బాలమురళి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? చివరకు ఈ కథకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే ప్రశ్నలకు సమాధానమే స్వాతిముత్యం కథ.

విశ్లేషణ: కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ స్వాతిముత్యం సినిమాతో నిర్మాతలు, హీరో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కథ, కథనం మరీ కొత్తగా లేకపోయినా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. రావు రమేష్, గోపరాజు రమణ తమకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

బెల్లంకొండ గణేష్ తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించినా నటుడిగా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. వర్ష బొల్లమ్మ తెరపై అందంగా కనిపించింది. ఈ సినిమా తర్వాత వర్షకు కచ్చితంగా ఆఫర్లు పెరుగుతాయని చెప్పవచ్చు. హీరో ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిషోర్ పరవాలేదనిపించారు. మహతి స్వరసాగర్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ గా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సితార నిర్మాతల నిర్మాణ విలువలు బాగున్నాయి. సూర్య సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

బెల్లంకొండ గణేష్, వర్షబొల్లమ్మ నటన

కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్

ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో చెప్పుకోదగ్గ కథ లేకపోవడం

సంగీతం

రేటింగ్ : 3/5

బాటమ్ లైన్ : ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా “స్వాతిముత్యమే”

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -