King Nagarjuna: టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ఆస్తుల లెక్క తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

King Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ఒకరు. 1959 ఆగస్టు 29వ తేదీ చెన్నైలో జన్మించిన నాగార్జున 1986లో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ విధంగా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఒకనక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి వారిలో నాగార్జున కూడా ఒకరని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ భారీగా ఆస్తులు కూడా పెట్టినటువంటి నాగార్జున ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించారు. ఇకపోతే తాజాగా తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోని ఇండస్ట్రీలో కొనసాగుతూ నాగార్జున ఇప్పటివరకు ఎంత మొత్తంలో ఆస్తులు కూడా పెట్టారనే విషయాల గురించి కూడా ఓ వార్త వైరల్ అవుతుంది.

 

నాగార్జున 2016వ సంవత్సరంలో మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపులు రూ. 16 కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తుంది. 2023 నాటికి నాగార్జున నికర ఆస్తులు విలువ 95 కోట్ల రూపాయలు అని సమాచారం. ఇక ఈయన వార్షిక ఆదాయం 40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది.ఇక హైదరాబాదులో సుమారు 42 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ఉంది అదే విధంగా కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి.

 

ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా ఈయన ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగానే డబ్బు తీసుకుంటున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.ఇక హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఈ అన్నపూర్ణ స్టూడియో విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. ఇలా నాగార్జున ఇండస్ట్రీలో కొనసాగుతూనే భారీగా ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -