TTD Chairman: వేంకటేశ్వర స్వామిని నల్ల రాయన్న వ్యక్తికి పదవా.. టీడీపీ నేత విమర్శలు వైరల్!

TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా ఇన్ని రోజులు వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డిని తొలగించిన అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డికి టిటిడి చైర్మన్ గా బాధ్యతలను అప్పజెప్పారు. ఈ విధంగా భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బాధ్యతలను అప్పగించడం పట్ల టిడిపి నేతరాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ గతంలో భూమన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని ఒక నల్ల రాయి అంటూ సంబోధిస్తూ మాట్లాడారు.గతంలో భూమన ఇంట్లో జరిగిన ఓ పెళ్లి తంతు క్రైస్తవ పద్ధతిలో జరిగింది ఆయన క్రైస్తవుడు అనడానికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలా హిందూ మతం పై గౌరవం లేనటువంటి ఒక వ్యక్తికి ఇలాంటి గొప్ప పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవ మతంపై ఉన్న నమ్మకం హిందూమతంపై లేదని అందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

 

భూమన కరుణాకర్ రెడ్డి గతంలో నక్సలైట్ ఉద్యమాలలో కూడా ఉన్నారు. ఆయన సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి. ఈ నల్ల రాయిని పాదరక్షకులతో కొడితే తప్పేంటి అంటూ స్వామి వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా పదవి కట్టబెట్టడం ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఈయన ప్రశ్నించారు.

 

గత ప్రభుత్వం టిటిడి బాధ్యతలు అన్నిటిని కూడా బీసీలకు అప్పచెప్పింది కానీ ఇప్పుడు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తూ స్వామివారి డబ్బు మొత్తం తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ రాంప్రసాద్ ఆరోపణలు చేశారు. ఈ విధంగా భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించడంపై టిడిపి నేత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -