Vijayasai Reddy: విజయసాయిరెడ్డి తలపై గుదిబండలా మారిన నెల్లూరు.. స్వాగతం చెప్పించడానికే అంత ఖర్చు చేశారా?

Vijayasai Reddy: వైసీపీలో నెంబర్ 1 పొజిషన్ ఆ పార్టీ అధినేత జగన్ ది. కానీ.. నెంబర్ 2 ఎవరు అంటే మూడు పేర్లు వినిపిస్తాయి. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి. వీళ్ల ముగ్గురి మధ్య వర్గపోరు నడుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారు. పార్టీ అధినేత జగన్ చెప్పిన పనులు చేసుకుంటూ పోతారు. ఆయన్ని పక్కన పెడితే.. సజ్జల రామృకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య మాత్రం కనిపించని వార్ నడుస్తోంది. అయితే.. ఇది ఇవాళ్టి వార్ కాదు. వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంది. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహిర్గతం అయింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు విజయసాయి రెడ్డి అంతా తానై చూసేవారు. జగన్ రాష్ట్రంలో చూసుకుంటే విజయసాయిరెడ్డి ఢిల్లీలో చూసుకునే వారు. పార్టీలో నెంబర్ 2 అంటే ఆయన పేరే వినిపించేది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. సజ్జల తెరపైకి వచ్చారు. జగన్ సీఎంగా ఉంటే.. సజ్జల అప్రకటితంగా అన్ని శాఖలకు మంత్రిగా వ్యవరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం తరుఫున ఏ శాఖకు సంబంధించి అంశంలోనైనా సజ్జల మొదల ప్రెస్ మీట్ పెడతారు. అందుకే ప్రతిపక్షాలు సజ్జలను సకల శాఖా మంత్రి అని పిలుస్తారు. అలా జగన్ తర్వాత తానే అన్నట్టు వ్యవహిరిస్తూ వస్తున్నారు.

ప్రభుత్వం పరంగానే కాకుండా.. పార్టీ పరంగా కూడా విజయసాయిరెడ్డి వెనకబడ్డారు. ఒకానొకదశలో.. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర రీజినల్ కోర్డినేటర్ గా తప్పించారు. పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలకు కూడా దూరం చేశారు. పార్టీకి చెందిన చాలా బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో.. ఇంటా బయట జగన్ పై విమర్శలు వచ్చాయి. అటు, విజయసాయిరెడ్డి కూడా మౌనం దాల్చారు. అంతకు ముందు విపక్షాలపై చేసినట్టు ఆరోపణలు తగ్గించారు. ఇదంతా గమనించిన జగన్ మరోసారి విజయసాయిరెడ్డి ముందుకు తెచ్చారు. పార్టీలో యాక్టివ్ రోల్స్ ఇచ్చారు. కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. గుంటూరుతో పాటు పలు జిల్లాలకు రీజినల్ కోర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి సొంతగూటికి చేర్చడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్రపోషించారని పార్టీలో చర్చ జరుగుతోంది. అలా పని చేస్తున్న విజయసాయి రెడ్డిపై మళ్లీ సజ్జల ఫోకస్ పెట్టారని పార్టీలో మళ్లీ చర్చ నడుస్తోంది.

సజ్జల ఒత్తిడితోనే విజయసాయి రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. అక్కడ ఆయన గెలిచే అవకాశం లేదు. నిజానికి నెల్లూరు విజయసాయిరెడ్డి సొంత జిల్లా అయినా అక్కడ ఆయనకు పెద్దగా పరిచయాలు లేవు. అందులోనూ నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ వైసీపీలో కీలక నేతలంతా టీడీపీ గూటికి చేరారు. ఇక… మంత్రి కాకాణి గోవర్దన్ ఉన్నారంటే.. ఆయన సజ్జల మనిషి. సజ్జల డైరక్షన్ లోనే ఆయన నడుస్తారు. దీంతో.. కాకాణి సహకారం కూడా విజయసాయి రెడ్డికి లేదు. గతంలో మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ నర్సారావు పేట ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక ఆయన తన వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇంకా విజయసాయిరెడ్డితో ఉన్నది జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే. ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి జిల్లా అడుగు పెడితే.. చంద్రశేఖర్ రెడ్డే స్వాగతం పలికారు. నిజానికి 500 కార్లతో విజయసాయిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ.. పార్టీలో ఎవరూ సహకరించకపోవడంతో ర్యాలీని విరమించుకొని సాదాసీదాగా నియోవర్గంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. దీన్ని చూసిన సొంత పార్టీ నేతలే పాపం విజయసాయి రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న సజ్జల… కనీసం ఢిల్లీలో కూడా విజయసాయిరెడ్డికి అవకాశం లేకుండా చేయాలని అనుకుంటున్నారని టాక్. అందుకే ఎంపీగా విజయసాయిరెడ్డిని ఓడిస్తే.. ఢిల్లీ వ్యవహారాలు కూడా ఊడిపోతాయని సజ్జల వ్యూహంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -