Venky: వెంకీ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లు ఏకంగా ఆ రేంజ్ లో ఉండబోతున్నాయా?

Venky: ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా వారి సినీ కెరియర్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సినిమాలను తిరిగి ప్రస్తుతం అభిమానుల కోసం విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ వంటి హీరోల అందరి సినిమాలు తిరిగి థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి.

ఈ క్రమంలోనే తాజాగా మరొక హీరో నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రవితేజ నటించినటువంటి వెంకీ సినిమా అప్పట్లో ఇలాంటి సంచలనాలను సృష్టించిన సంగతి మనకు తెలిసిందే . శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ స్నేహ నటించిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

 

అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేసింది. అయితే మరోసారి ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ప్రేక్షకులను సందడి చేయడానికి థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోని ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ తిరిగి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి మేకర్స్ రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశారు.2004లో విడుదలైన ఈ సినిమా మొదట్లో కాస్త కలెక్షన్లు తగ్గినప్పటికీ అనంతరం భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

 

ఇక ఈ సినిమా విడుదలైన సమయంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఆర్య సినిమా విడుదలైనప్పటికీ వెంకీ సినిమా మాత్రం 79 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడి వెంకీ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరోసారి ఈ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియడంతో ఈ సినిమాని మరోసారి సక్సెస్ చేయాలని రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -