Tollywood: ఈ ఇద్దరు హీరోలలో గ్రేట్ హీరో ఎవరంటే?

Tollywood: టాలీవుడ్ లో ఒక హీరోని మరో హీరోతో పోల్చడం అనేది ఎప్పటి నుండో ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ పూర్తిస్థాయిలో నిలదొక్కుకోని కాలం నుండే ఈ పోలిక సాగుతుండగా.. టాలీవుడ్ స్థాయి విపరీతంగా పెరిగిన ఈ సమయంలో ఇది మరింత ఎక్కువైంది. పలానా హీరో నటనలో ఇరగదీస్తాడన, మరో హీరో రికార్డులు క్రియేట్ చేస్తాడని, ఇంకో హీరో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తాడని.. ఇలా రకరకాలుగా పోలుస్తూనే ఉంటారు.

 

తాజాగా టాలీవుడ్ లోని కీలకమైన ఓ సినీ కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల గురించి కొంతమంది పోలుస్తూ.. వారి విషయాలను బేరీజు వేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రభావం చూపే దగ్గుబాటి కుటుంబానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్ మరియు దగ్గుబాటి రానాల గురించి ఇప్పుడు పోలిక, పోటీ సాగుతోంది. ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే చర్చ సాగుతుండగా.. నటన విషయంలో ఎవరు గొప్పవాళ్లు అనే చర్చ అందరిలో ఆసక్తిని రేపుతోంది.

 

దగ్గుబాటి కుటుంబం పేరును తన నటనతో పెంచిన వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్. ఒకప్పుడు ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన వెంకటేశ్.. ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అయ్యేది. అందుకే అతడికి ఏకంగా ‘విక్టరి’ వెంకటేష్ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ తన నటనతో వెంకటేశ్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడమే కాకుండా వారికి కొత్త అనుభూతిని పంచడంతో వెంకటేశ్ ఎప్పుడూ విఫలం కాలేదు.

 

దగ్గుబాటి కుటుంబం నుండి వచ్చిన యంగ్ హీరో రానా కూడా తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. టాలీవుడ్ లోని మోస్ట్ ట్యాలెంటెడ్ యంగ్ హీరోల జాబితాలో రానా ఉండగా.. కేవలం తెలుగు సినిమాలకే కాదు, బాలీవుడ్ లో కూడా రానా తన హవాను కొనసాగిస్తున్నాడు. అయితే వెంకటేశ్, రానాలను పోలిస్తే మాత్రం నటనలో వెంకటేశ్ ఎంతో గ్రేట్ అనే విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి. వెంకటేశ్ కేవలం తన ఎక్స్ ప్రెషన్స్ తోనే ప్రేక్షకులను నవ్వించగలడు, ఏడిపించగలడు. అందుకే నటనా పరంగా వెంకటేశ్ గ్రేట్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -