Vijayashanti: కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న విజ‌య‌శాంతి.. అక్కడైనా విజయం సాధించడం సాధ్యమేనా?

Vijayashanti: ఎంఐఎం పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి సమర్థిస్తూ అలాగే సోనియాగాంధీ అంటే నాకు ఇష్టం అంటూ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ రాహుల్ చేసిన వ్యాఖ్య ఏమిటంటే ఎంఐఎం, విఆర్ఎస్ ఒకటే అని సయామీ ట్విన్స్ అని చెప్పుకొచ్చాడు రాహుల్ గాంధీ. అయితే ఇదే నినాదం నేను ఎప్పటినుంచో చెప్తున్నాను అదే మాటని ఈరోజు రాహుల్ గాంధీ బహిరంగలో చెప్పటం ఎంతైనా సమంజసం.

అయితే మిగతా రాష్ట్రాలలో ఎంఐఎం కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయం మరియు అర్థం కాని విషయం. అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్ కు రావటం వలన బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా అని అన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా అని ప్రశ్నించారు.

ఒక్క మాటలో దేశమంతా వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావం చేయగలుగుతున్నదా అని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తప్పక అభిమానంతోనే చూస్తాం. రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం అని ఆమె కామెంట్ చేశారు. సోనియా గాంధీ పై కూడా ఆసక్తికరమైన కామెంట్ చేశారు విజయశాంతి సోనియా గాంధీ ని తెలంగాణ ప్రజలు అభిమానంతోనే చూస్తారని రాజకీయాలకు అతీతంగా తాను సైతం ఆమెని గౌరవిస్తానని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రేసులో ఒక అడుగు ముందుకు వేసింది. ఇలాంటి రాజకీయ పరిస్థితులు నడుస్తున్న సమయంలో విజయశాంతి చేసిన ఈ కామెంట్స్ బీజేపీ లో కలవరం మొదలైంది. అంటే విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతుందా? అందుకు తన మాటల ద్వారా హింట్ ఇస్తుందా అంటూ అప్పుడే చర్చలు మొదలుపెట్టారు రాజకీయ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -