Vijayashanti: బీజేపీకి రాములమ్మ గుడ్ బై? దుమారం రేపుతోన్న కామెంట్స్

Vijayashanti: సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సీనియర్ హీరోయిన్ గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆమె.. లేడీ ఓరియెంటెండ్ సినిమాలతో హీరోలకు పోటీగా స్టార్ డమ్ ను తెచ్చుకుంది. హీరోలతో సమానంగా విజయశాంతి సౌత్ ఇండియాలో పేరు తెచ్చుకుంది. సౌత్ ఇండియాలో లేడీ అమితాబ్ గా విజయశాంతికి బిరుదు ఉంది. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరంటే విజయశాంతి అని టక్కున ఎవరైనా చెబుతారు. చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్ హీరోలందరితో విజయశాంతి సినిమాలు చేసింది.

లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు టాలీవుడ్ లో విజయశాంతి పెట్టింది పేరు. లేడీ ఓరియెంటెండ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆమె సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయశాంతి ఒకసారి ఎంపీగా గెలిచింది. టీఆర్ఎస్ లో చేరిన ఆమె.. తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ తో విబేధాలు వల్ల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ లో కొన్ని రోజుల పాటు ఉన్న విజయశాంతి గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే బీజేపీలో ఆమెకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో జరిగే బీజేపీలో తొలి నుంచి ఆ పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది. పదవులు కూడా తొలినుంచి పార్టీలో ఉన్నవారికే వస్తాయి. బీజేపీలో చేరిన విజయశాంతికి ఆ పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు. సాధారణ నాయకురాలిగానే ఆమె కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్ గానే కాకుండా ఆమెకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో గత కొంతకాలంగా బీజేపీలో ఆమె యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే గురువారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేవారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్ధంలో ఉంచిందని, తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని మీడియాకు సూచించారు. తన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో బండి సంజయ్, లక్ష్మణ్ కే తెలియాలన్నారు.

పార్టీ బాధ్యతలు ఇస్తే ఏమైనా చేయగలమని, ఇవ్వకపోతే ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. పార్లమెంట్ లో కొట్లాడిన మనిషినని, తన పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుందని విజయశాంతి వ్యాఖ్యానించారు. పాత్ర లేకుండా చేయాలనుకునేవాళ్లకు పాతరేస్తే బెటర్ గా ఉంటుందన్నారు. తన పాత్ర ఎప్పుడూ టాప్ పాత్రేనని, ఉద్యమకారణిగా అందరి మనస్సుల్లో ఉన్నానని ఆమె అన్నారు. ఇప్పుడు తనకేమీ అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నారు.

విజయశాంతి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆమె బీజేపీలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న అసంతృప్తిగా ఆమె ఇప్పుడు బయటపెట్టినట్లు అర్థమవుతుంది. బీజేపీలో కీలక పదవి కోసం విజయశాంతి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. లక్ష్మణ్ కు రాజ్యసభ పదవి ఇవ్వడం పార్టీలోని సీనియన్ నేతలకు నచ్చడం లేదు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ్ లాంటి నేతలు పోటీ పడినా.. లక్ష్మణ్ కు ఇచ్చారు. దీంతో ఇప్పుడు విజయశాంతి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆమె బీజేపీకి గుడ్ బై చెబుతారా.. లేదా వేరే పార్టీలోకి జంప్ అవుతారా అనే వార్తలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -