Vijayashanti: రాజకీయాలకు విజయశాంతి గుడ్ బై?

Vijayashanti: సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలుగు రాష్ట్రాల్లో హీరోయిన్ గా ఎంత పాపులర్ అనేది తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా ఆమె ఓ వెలుగు వెలిగారు. స్టార్ హీరోలతో సమానంగా ఆమె స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. స్టార్ హీరోలతో పోటీగా సినిమాలు చేసేవారు. లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు విజయశాంతి పెట్టింది పేరు. హీరోలతో సమానంగా ఆమె రెమ్యూనరేషన్ అందుకునేవారు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరీతో కలిసి సినిమాలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలందరీతో కలిసి నటించారు.

సినిమాల పరంగా విజయశాంతి సూపర్ సక్సెస్ అవ్వగా.. రాజకీయంగా మాత్రం ఆమె ఫెయిల్యూర్ అయ్యారు. రాజకీయంగా ఆమెకు ఎక్కడా కలిసి రావడం లేదు. ఏ పార్టీలో చేరినా సరే ఆమెకు అదౄష్టం కలిసి రావడం లేదు. ఎన్ని పార్టీలు మారినా సరే రాజకీయంగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన విజయశాంతి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకి వచ్చి మన తెలంగాణ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. టీఆర్ఎస్ నుంచి ఒకసారి ఎంపీగా గెలుపొందారు.

ఒకప్పుడు కేసీఆర్ తో విజయశాంతి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా విజయశాంతి పక్కన ఉండేవారు. అంతగా కేసీఆర్ తో విజయశాంతి సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమీ కాని కేసీఆర్ తో విబేధాలు రావడంతో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన పలుమార్లు ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా బయటకి వచ్చి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలోనే విజయశాంతి కొనసాగుతున్నారు. బీజేపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్నారు.

కానీ బీజేపీలో కూడా విజయశాంతికి కలిసి రావడం లేదు. బీజేపీలో ఆమెకు ప్రాధాన్యత దక్కడం లేదు. బీజేపీలో ఆమెకు ఎలాంటి కీలక పదవులు దక్కడం లేదు. తనకు ఉన్న పాపులారిటీ కూడా బీజేపీ వాడుకోవడం లేదనే భావన విజయశాంతిలో ఉంది. దీంతో గత కొంతకాలంగా బీజేపీలో విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారు. కేంద్రం నుంచి ప్రముఖులు వచ్చినప్పుడు ఏర్పాటు చేస కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొనడం తప్పితే.. ఆమె యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇటీవల బీజేపీపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

బీజేపీలో తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని, ఎలాంటి పదవులు కూడా ఇవ్వం లేదని బహుమాటంగా చెప్పేశారు. రాష్ట్ర నాయకత్వం కేంద్ర పెద్దలకు తప్పుడు నివేదికలు ఇస్తుందని ఆరోపించారు. బండి సంజయ్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకులు బండి సంజయ్ చుట్టూ చేరి తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో ఆమె బీజేపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం కూడా జరిగింది.

ఈ క్రమంలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో విజయశాంతి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న ఆమె.. విమర్శలు చేయడంలో కూడా ముందు ఉంటారు. ప్రత్యర్ధి పార్టీలకు గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటారు. గట్టిగా వాయిస్ వినిపిస్తూ ఉంటారు. కానీ ఏ పార్టీలో చేరినా విజయశాంతికి కలిసి రావడం లేదు. ఆమె పార్టీ మారడానికి కూడా ఇక ఏ పార్టీలు మిగిలి లేవు. ప్రధాన పార్టీలన్నింటిలో చేరారు. దీంతో ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పడమే కరెక్ట్ అనే ఆలోచనలోకు విజయశాంతి వచ్చినట్లు ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.

త్వరలో రాజకీయాలకు విజయశాంతి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా లేదా మెయిస్ స్ట్రీమ్ మీడియా ద్వారా ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం తెలంగాణలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికప్పుడు గుడ్ బై చెప్పే ఆలోచన ఆమె లేదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, గెలిస్తే రాజకీయాల్లోకి కొనసాగుతారని, ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తారని చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో వస్తుున్న సినిమాలో విజయశాంతి నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో రాజకీయాలను వదిలేసి పూర్తిగా సినిమాలకు పరిమితం అయ్యరనే ప్రచారం సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -