Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో కార్మికులు న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నారు. కోకింగ్ కోల్ తయారీకి అవసరమైన విదేశీ బొగ్గును ఈ పోర్టు ద్వారానే స్టీల్ ప్లాంట్ దిగుమతి చేసుకుంటుంది ప్రస్తుతం 1.5 లక్షల టన్నుల బొగ్గుతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రెండు నౌకలు గంగవరం పోర్టులో ఐదు రోజులుగా నిలిచిపోయాయి.

బొగ్గు సరఫరా లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ లోని ఐదు కోక్ ఓవెన్ బ్యాటరీ లో రెండింటిలో ఉత్పత్తిని జీరో చేశారు. కోకో ఓవెన్ బ్యాటరీలను షట్ డౌన్ చేయడం వలన భారీ నష్టం జరగనుంది. వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలంటే వందల కోట్ల వ్యయం అవుతుంది. నిజానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకులు అన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందించటానికి ఆదాని, గంగవరం పోర్టు ఒప్పందం చేసుకుంది.

ఇప్పుడు దానిని పాటించడం లేదు, కార్మికుల ఆందోళనను సాకుగా చూపుతోంది.ఈసారి చేతికి మట్టి అంటకుండానే భారీ స్థాయిలో కుట్ర చేసి విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ను మూసివేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనివల్ల భారీ నష్టం ఎదుర్కొంటున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్లాంట్ ని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ మల్లికార్జునని మంగళవారం కలిశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్లో శాశ్వత కాంట్రాక్టు ఉద్యోగులు మొత్తం 30 వేల మంది పనిచేస్తున్నారు. మరొక 50,000 మంది పరోక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న పోర్టు కార్మికుల ప్రయోజనాల కోసం లక్షల మంది స్టీల్ ప్లాంట్ కి నష్టం జరుగుతుంటే స్పందించకపోవడం, ఎన్నికల ముందు కార్మికులు సమ్మె చేయటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు చేతకాని పాలనకు ఇది నిదర్శనం అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -