వ్యూహం రివ్యూ: వైఎస్ఆర్సీపీ అభిమానులకు పండగే!

Vyuham Movie: దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఇంతకుముందు యాత్ర, యాత్ర 2 సినిమాలు వచ్చి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రాంగోపాల్ వర్మ కూడా వ్యూహం పేరుతో రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర కధ మొదలై వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మధ్యలో జరిగిన పరిణామాలని కథ రూపంలో తీసుకువచ్చాడు. తాజాగా ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని, ఎన్నో వాయిదాల తర్వాత మన ముందుకి వచ్చింది. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకోవటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

 

క్యారెక్టర్ల పేర్లు మార్చి తనదైన పంధా లో క్యారెక్టర్లకి పేరు పెట్టి సినిమాని తెరకెక్కించాడు రాంగోపాల్ వర్మ. తండ్రి మరణం తర్వాత రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎందరో చనిపోయారని తెలుసుకొని వారిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటాడు మదన్ రెడ్డి. అందుకు హై కమాండ్ అడ్డుకోవడం తోపాటు ప్రతిపక్ష నాయకుడుతో కలిసి అతని మీద కేసులు పెట్టడంతో జైలు పాలవుతాడు. ఆ సమయంలోనే శ్రవణ్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని ఇంద్రబాబు ఎన్నికలలో గెలుస్తాడు.

 

అయితే 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్ 2019లో ఎందుకు ఇవ్వలేదు? వారిద్దరి మధ్యన వచ్చిన అభిప్రాయాబేదాలు ఏమిటి? జైలు నుంచి వచ్చిన మదన్ రెడ్డి కొత్త పార్టీని పెట్టడం, ప్రతిపక్ష కుట్రని ఎదుర్కొంటూ ప్రజానాయకుడిగా ఎదగడం అనేది సినిమా కథ. ఇక సినిమా ఎలా ఉందంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ పై ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నప్పుడు ప్రజలను మాత్రమే నమ్ముకుని జగన్ నాయకుడిగా ఎలా ఎదిగాడు అని వర్మ చక్కగా చూపించాడు.

 

కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి సతీమణి ఎలా అండగా నిలబడ్డారు అనేది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. అలాగే వైఎస్ సతీమణి పాత్రధారిని మానస కూడా మాలతి( వైయస్ భారతి ) పాత్రలో ఒదిగిపోయింది అని చెప్పాలి. చంద్రబాబు పాత్రలో ధనుంజయ్ ఇంతకుముందే అందరికీ సుపరిచితం. సాంకేతిక పరంగా కూడా సినిమా చాలా బాగుంది. ఈ సినిమా చూసిన వైఎస్ఆర్సీపీ అభిమానులు పండగ చేసుకుంటారనటంలో ఎలాంటి సందేహము లేదు. ఈ సినిమాకి 3/5రేటింగ్ ఇచ్చారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -