Vyuham: వ్యూహం మూవీ టీజర్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ తనను తాను పొడుచుకుంటున్నాడా?

Vyuham: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం వ్యూహం. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా నుంచి సెకండ్ టీజర్ విడుదల చేశారు.

ఎప్పటిలాగే ఈ టీజర్ లో డైలాగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ చివరిలో మాత్రం చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే డైలాగ్స్ మాత్రం టీజర్ కే హైలైట్ అయ్యాయని చెప్పాలి. ఈ టీజర్ లో భాగంగా ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ.. ఎప్పుడో ఒకప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అని కూడా వెన్నుపోటు పొడుస్తున్నారుగా అంటూ మాట్లాడుతారు దీంతో చంద్రబాబు నాయుడు వాడికి అంత సీన్ లేదు తనని తానే పొడుచుకుంటాడు అంటూ సమాధానం చెబుతారు.

 

ఇలా పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు ఈ టీజర్ లాస్ట్ లో చెప్పినటువంటి డైలాగ్ మాత్రం టీజర్ కి హైలైట్ గా నిలిచింది. దీంతో చంద్రబాబు నాయుడు దృష్టిలో పవన్ కళ్యాణ్ స్థానం ఏంటో రాంగోపాల్ వర్మ చెప్పకనే చూపించేశారు. ఈ సినిమాలో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలే ప్రధానంగా ఉంటాయని స్పష్టం చేసిన వర్మ.. చెప్పినట్టుగానే టీజర్ లో ఈ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.

 

ఈ టీజర్ లో వీళ్లతో పాటు, చిరంజీవి, సోనియాగాంధీ లాంటి పాత్రలకు కూడా స్థానం దక్కింది. అయితే టీజర్ లో జగన్ పాత్రధారి తర్వాత, పవన్ కళ్యాణ్ పాత్రధారికే ఎక్కువగా స్పేస్ లభించిందని తెలుస్తుంది.ఏది ఏమైనా ఎన్నికలకు ముందు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాని విడుదల చేయబోతూ రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనం సృష్టించబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -