Ramcharan: రామ్‌చ‌ర‌ణ్‌కు జాతీయ అవార్డు రాకుండా అడ్డు ప‌డింది అతనేనా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Ramcharan: తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఇటీవల జరిగిన జాతీయ అవార్డుల గురించే చర్చించుకుంటున్నారు. కేవలం ప్రేక్షకులు అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఆ జాతీయ అవార్డు కార్యక్రమంలో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసిందే. 69 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా ఆరుదైన ఘనతను సాధించారు అల్లు అర్జున్. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ కూడా బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ నటించిన మగధీర సమయంలో రెండవ సినిమాకే అంత గొప్ప ప్రతిభ కనబరిచాడా అంటూ ప్రశంసలు వ్యక్తం అయ్యాయి. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. రామ్‌ చరణ్ నటనకు గాను నంది అవార్డు వస్తుందని అనుకున్నారు. ఉత్తమ నటుడుగా నంది అవార్డు కోసం చరణ్ పోటీపడ్డాడు కూడా, అయితే ఆ సంవత్సరం అనూహ్యంగా మొత్తం అవార్డులు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సొంతం చేసుకున్నారు. మేస్త్రి సినిమాలో ఆయన న‌ట‌న‌కు అవార్డు దక్కింది. కాగా రంగస్థలం సినిమాలో తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు రామ్ చరణ్.

 

చిట్టిబాబుగా చెవిటి పాత్రలో చరణ్ నటనకు జాతీయ ఉత్తమన‌టుడిగా అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అదే ఏడాది కీర్తి సురేష్ మహానటి, ఆయుష్మాన్ ఖురానా చెవిటి పాత్రలో నటించిన సినిమాలు పోటీ పడ్డాయి. చివరకు జూరీ ఆయుష్మాన్ ఖురానా వైపు మొగ్గుచూపింది కనీసం ఆయుష్మాన్ ఖురానాతో పాటు రామ్ చరణ్ కి కూడా సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పంచుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా చరణ్ కు నిరాశ తప్పలేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ విషయంలో రామ్ చరణ్ ని మరోసారి దురదృష్టం వెంటాడింది. ఈసారి కూడా చరణ్- బన్నీ ఇద్దరు అవార్డుల కోసం పోటీ పడతారు అన్న ప్రచారం జరిగింది. చివరకు బన్నీకే అవార్డు దక్కింది. అలా మూడుసార్లు రామ్‌చరణ్ జాతీయ అవార్డుల చివరి అంచల వరకు వెళ్లి నిరాశ చెందాల్సి వచ్చింది. మగధీర విషయంలో కచ్చితంగా అవార్డు వస్తుంది అనుకున్న దాసరి నారాయణరావుకి అవార్డు ఇవ్వాలన్న నిర్ణయం చరణ్ కు మైనస్ అయింది. ఈ విషయంలో మాత్రం చెర్రీ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -