Ramcharan: ఆ స్టార్ కూతురిని చిరంజీవి కొడుకుకి ఇవ్వాలనుకున్నారా?

Ramcharan: టాలీవుడ్ ప్రేక్షకులకు చిరంజీవి గురించి అయన స్థాయి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో నటుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. మరి ఇదిలా ఉంటే చిరంజీవి, స్టార్ హీరో వెంకటేష్ ల స్నేహం మరో స్థాయిలో ఉండేదని చెప్పవచ్చు. వీళ్ళిద్దరి స్టార్ హీరోలది మంచి ఫ్రెండ్షిప్. ఇక అప్పట్లో వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమాలన్నీ చిరంజీవి నే ప్రమోట్ చేసాడట.

అలా ఈ ఇద్దరు స్టార్ హీరోలు స్నేహ పరంగా ఎంతో నమ్మకంగా ఉంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇక అప్పట్లో వీరిద్దరి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుందామని వీరు ఇరువురు అనుకున్నట్లు తెలిసింది. మెగాస్టార్ వారసుడు రాంచరణ్ కి వెంకటేష్ కూతురు ఆశ్రితను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. కానీ అప్పటికే వీళ్లిద్దరు చిన్న పిల్లలు కావడంతో వీళ్ళిద్దరి చదువు పూర్తయిన తర్వాత మాట్లాడుకుందామని అనుకున్నారట.

అలా కొంతకాలం ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఆ గ్యాప్ లో రామ్ చరణ్, ఆశ్రితలు ఇద్దరు వేరువేరు వాళ్ళని ప్రేమించారు. రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి ఈ విషయం గురించి మెగాస్టార్ కి తెలియజేశాడు. ఇక మెగాస్టార్ వెంకటేష్ కి ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇక దాంతో వెంకటేష్ కూడా పిల్లలు ఇష్టం కంటే మనకు అంతకంటే ఎక్కువ ఏం లేదు అన్నట్లు లైట్ తీసుకున్నట్లు తెలిసింది.

ఆ తర్వాత కొంతకాలానికి వెంకటేష్ కూతురు ఆశ్రిత కూడా హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారి మనవడిని ప్రేమించింది. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మెగా,దగ్గుబాటి అభిమానులు ఈ రెండు ఫ్యామిలీలు ఒకటైతే బాగుండు అని భావించారు. కానీ వెంకటేష్ కూతురు ఆశ్రిత చిరంజీవి ఇంటి కోడలు కాలేకపోయింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -