Chiranjeevi: ఈ చిరంజీవి సినిమా అంటే రామ్ చరణ్ కు అస్సలు నచ్చదా?

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ వచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ఇప్పటికే పేరు సాధించారు. చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మెగా వారసుడిగా మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించారు. ఆ తర్వాత రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 

 

వరుసగా సినిమాలు చేస్తూ రామ్ చరణ్ ముందుకు సాగుతున్నారు. హిట్లు, ప్లాపులు లెక్కజేయకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నారు. మగధీర సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అద్బుత విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆయన ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించారు.

 

తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమానే కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయనున్నారు. రామ్ చరణ్ సాధించిన స్టార్ డమ్ ను చూసి చిరంజీవి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ సినీ కెరీర్ లో ఒక్క సినిమా మాత్రం చిరంజీవికి నచ్చలేదట. ఈ సినిమా ఎందుకు చేశావురా బాబు అంటూ బాధపడుతున్నారట. ఆ సినిమా స్వయంగా యాక్సెప్ట్ చేసింది చిరంజీవే కావడంతో మరింత బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

 

ఆ సినిమా ఏంటంటే సరిగ్గా 8 ఏళ్ల క్రితం వచ్చిన జాంజీర్. తెలుగులో తుఫాన్ గా వచ్చింది. ఈ సినిమా పరమ చెత్త రికార్డును పొందింది. సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక చోప్రాకు రామ్ చరణ్ తమ్ముడు గా ఉన్నాడంటూ అందరూ కామెంట్ల వర్షం కురిపించారు. సినిమాను చూసిన మెగా ఫ్యాన్స్ సినిమా డిజాస్టర్ అంటూ, కథ ఎంపికలో ఫెయిలయ్యారంటూ ఫైర్ అయ్యారు. ఈ కథను చిరంజీవే స్వయంగా సెలక్ట్ చేయడంతో తాను ఎందుకు ఈ సినిమాకు సైన్ చేశానా అని చిరంజీవి బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -