Jr NTR: అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు రెండెకరాల పొలం ఇస్తామని అన్నారా?

Jr NTR: సాధారణంగా హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. నందమూరి హరికృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయన మొదట పెద్దలు కుదిరించిన వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురి పిల్లలలో ఒకరు ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. ఆయనే హీరో కళ్యాణ్ రామ్. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కూతురు స్వాతికి వివాహం చేశారు.. హీరో కళ్యాణ్ రామ్ బాలయ్య బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.

అయితే హరికృష్ణ ఓ క్లాసికల్ డాన్స్ టీచర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని. ఆమె కర్ణాటక ప్రాంతానికి చెందింది. నందమూరి కుటుంబసభ్యులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో హరికృష్ణ ఆమెను వేరే ఇంట్లో కాపురం పెట్టాడు. వీరిద్దరికి ఒక సంతానం. అతనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ చిన్న వయసులో ఉన్నపుడు షాలిని అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారంట.

ఇక ఎన్టీఆర్ చిన్న పిల్లాడిగా ఉన్నపుడు అనేక అల్లరి పనులు చేస్తూ ఉండేవాడట. ఆయన తల్లితో చాలా దెబ్బలు తినే వాడినని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. షాలిని ఎన్టీఆర్‌ని కొట్టి మళ్లీ ఆమె ఏడ్చేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సినిమాలోకి వచ్చిన తర్వాతే సరైన గౌరవం దక్కిందని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వస్తాడన్న సమయంలో నందమూరి ఫ్యామిలీ వాళ్ళు ఆయనకి రెండెకరాల పొలం ఇస్తానని చెప్పి అవమానించిందని అప్పట్లో ఓ వార్త వైరల్ అయ్యింది. కానీ ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. వెండితెరపై హీరోలా రాణిస్తూనే బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. కొన్ని కోట్ల ఆస్తులను సంపాదించుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -