Devara: దేవర మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పవా?

Devara: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసాయి. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరో మూడు నెలల్లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

 

ఇది ఇలా ఉంటే గత నాలుగు ఐదు రోజులుగా దేవర సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దాంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. దేవర రిలీజ్‌ పోస్ట్‌ పోన్ అంటూ ఇటీవలే వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ ను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. రెండు పార్టులుగా దేవర సినిమా విడుదల కానుండగా.. తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ ఇటీవలే గాయాల పాలయ్యారు. దీంతో మూవీ షూటింగ్ కూడా లేట్ అవుతుందంటూ ఇంకొన్ని వార్తలు వచ్చాయి.

అయితే ఆగస్టులో దేవర సినిమా రిలీజ్ అవుతుందని ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ పక్కా అని బన్నీ టీమ్ ఇటీవలే కన్ఫర్మ్ చేయడంతో దేవర మరో డేట్ లోకి వెళ్లినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. ఈ మూవీ ఫైనల్ గా దసరా కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -