Devara: ఓవర్సీస్ దేవర మూవీ రికార్డ్ ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Devara: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా ఈ సంవత్సరం విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి మరే సినిమా లేదు. కనుక ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా మీద ఎన్నో అసలు పెట్టుకొని తమ హీరోని స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.

 

ఇప్పటికే చాలా బజ్ క్రియేట్ అవుతుంది అనే టైంలో ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్రం బృందం. అందులో విజువల్స్, అనిరుధ్ బిజిఎం అన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ వేయికనులతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి మార్కెటింగ్ పనులు మొదలయ్యాయి. నైజాంలో 45 నుంచి 50 కోట్ల వరకు బేరం కుదురుతుంది. ఇది మైత్రి మూవీ మేకర్స్ కి ఇవ్వాలా లేకపోతే వెంకటేశ్వర క్రియేషన్స్ కి ఇవ్వాలా అనే విషయం ఇంకా తేల్చవలసి ఉంది.

ఇది ఇలా ఉంటే మరోవైపు ఓవర్సీస్ లో మార్కెట్ క్లోజ్ అయ్యే స్టేజ్ లో ఉంది. 27 కోట్లకు బేరం కుదురుతున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో అంటే ఈ మాత్రం ఉండాలి. సినిమా ఒకవేళ హిట్ అయితే ఓవర్సీస్ లో నుంచి మంచి అమౌంట్ వస్తుంది. వీళ్ళిద్దరి కాంబోకి ఉన్న హైప్ కి ఈజీగా ప్రాఫిట్ లో వచ్చేస్తాయి. కొరటాల శివ కెరీర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. దీని కోసం గట్టిగానే ఖర్చు పెడుతున్నారు.

 

సుమారు 200 కోట్లు వరకు ఈ సినిమా మార్కెటింగ్ జరుగుతుంది అంటున్నాడు ఈ సినిమా నిర్మాత కొరటాల శివ స్నేహితుడు. మార్కెటింగ్ అంతా ముగిసిన తర్వాత సినిమా ఈ సంవత్సరంలో విడుదల కానుంది అని కచ్చితంగా తెలుస్తుంది. పోస్ట్ పోన్ అవుతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి కానీ ఈ సంవత్సరం విడుదలవుతుందని గ్యారెంటీ మాత్రం కనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -