Mohan Babu: మోహన్ బాబు చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడా.. రాజకీయాల్లోకి లాగితే బాగోదంటూ?

Mohan Babu: ఏపీ రాజకీయాలు చాలా దారుణంగా తయారైయ్యాయి. ఒకరిపై విమర్శలు చేయడానికి మరొకరిని చాలా మంది వాడుకుంటారు. అంతకాదు.. వ్యక్తిగత విషయాల్లోకి, ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి చొచ్చుకుపోతారు. అలా ఫ్యామిలీ అంశాలను ప్రస్తావిస్తే.. ప్రత్యర్థులు ఇబ్బంది పడితే.. విమర్శలు చేసిన వాళ్లు పండగ చేసుకుంటారు. ఇలా చంద్రబాబును తిట్టడానికి వైసీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్‌ను, సీనియర్ ఎన్టీఆర్‌ను, మోహన్ బాబును పేర్లు ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు… ఎన్టీఆర్‌ను పోటు పొడిచారని.. పార్టీని ఆయన దగ్గర నుంచి లాక్కొన్నారని విమర్శలు చేస్తారు. కానీ, అదే ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు చంద్రబాబుతో కలిసి ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో బలపడింది. అంతేకాదు.. మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. టీడీపీ కార్యకర్తలకు, ఎన్టీఆర్ ఫ్యామిలీకి లేని నొప్పి వైసీపీ నేతలకు ఎందుకో అర్థం కాదు. నిజానికి టీడీపీ పార్టీ అప్పట్లో చేతులు మారకపోతే.. ఇప్పుడు ఆ పార్టీకి మనుగడే ఉండేది కాదని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ, చంద్రబాబును పదేపది అదే విషయాన్ని ప్రస్తావించి వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. దీంతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి అత్యుత్సాహమే చూపిస్తారు. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా మోసం చేశారని కొడాలి నాని ప్రస్తావిస్తూ ఉంటారు. 2009 ఎన్నికల్లో తారక్‌ను ప్రచారానికి వాడుకొని తర్వాత దూరం పెట్టారని అంటూ ఉంటారు. అయితే, దీనిపై తారక్ ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు.. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు పని చేయడానికి సిద్దంగా ఉంటానని పలుసార్లు చెప్పారు. నిజంగానే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను మోసం చేస్తే.. ఆయన మాట్లాడుతారు కదా? కానీ ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారు? అనేది కూడా కొడాలి నాని అర్థం చేసుకోకుండా అవకాశం దొరికనపుడల్లా ఆయన పేరును వాడేస్తూ ఉంటారు.

ఇక మోహన్ బాబు పేరును కూడా వైసీపీ నేతలు అడపా దడపా వాడేస్తూ ఉంటారు. ఈ విషయం పోసాని కృష్ణ మురళీ ముందుంటారు. చంద్రబాబును తిట్టడానికి కారణాలు వెతుక్కొనే పోసాని ఇటీవల హెరిటేజ్ విషయంలో బాబుపై విరుచుకుపట్టారు. హెరిటేజ్ మోహన్ బాబు స్థాపించిన సంస్థ అని.. దాన్ని చంద్రబాబు లాక్కొన్నారని మండిపడ్డారు. దానిపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ రాజకీయ అవసరాల కోసం తన పేరును వాడుతున్నారని మండిపడ్డారు. తన అనుమతి లేకుండా తన గురించి ప్రస్తావిస్తే చర్యలు తీసుకుంటానని మోహన్ బాబు.. పేరు చెప్పకుండానే పోసానికి వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి పోసాని సైలంట్ అయ్యారు. అంతేకాదు.. మోహన్ బాబు పేరును వాడటానికి మిగిలిన వారు కూడా సాహసించలేదు.

మోహన్ బాబు లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ వార్నింగ్ ఇస్తే వైసీపీ వాళ్లు సైలంట్ అవుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. అనవసరంగా కొడాలి నాని తారక్ పేరును తీసుకొని వచ్చి.. టీడీపీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు పెంచుతున్నారు. ఇప్పటికే పలుసార్లు కొట్లాట కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం కొడాలి నాని అనడంలో అతిశయోక్తి లేదు. నిన్న కూడా కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని చంద్రబాబుపై కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే.. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్తాయని అన్నారు. అంతేకాదు.. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే.. తారక్ ను పార్టీ నుంచి గెంటేస్తారని విమర్శించారు. అయితే, తారక్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాల్లో బిజీగా ఉంటున్నారు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మి ఇండస్ట్రీలో తారక్ కు మంచి డిమాండ్ ఉంది. అందుకే బాలివుడలో కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో తారక్ ను రాజకీయంగా వాడుకోవడం సరికాదు. కాబట్టి మోహన్ బాబులాగే.. తారక్ కూడా ఓ వార్నింగ్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -