Banana peel: ఏంటి.. అరటితొక్క వల్ల అన్ని ఉపయోగాలా?

Banana peel: అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అరటిపండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. కొందరు అరటి పండ్లను డజన్లకు డజన్లు తింటే మరి కొంతమంది అరటి పండ్లను అంతగా తినడానికి ఇష్టపడరు. అరటి పండులో ఫైబర్ పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

ఐరన్ లోపం ఉన్నవారు అరటి పండ్లను తినడం ఎంతో మంచిది. డయాబెటిస్ పేషెంట్లు తినడానికి ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. అరటిపండుతో మాత్రమే కాకుండా అరటిపండు తొక్క వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మామూలుగా మనం అరటిపండు తినగానే వెంటనే తొక్కలను పడేస్తూ ఉంటాం. ఆ తొక్కలో ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. చర్మ సంరక్షణ కోసం, పళ్ళు తెల్లబడటం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అరటిపండు తొక్కను ముఖంపై రుద్దడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, ముడతలు తగ్గుతాయి. మొటిమల మచ్చలపై తొక్కను రుద్దడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.

 

మొటిమలు ఉన్న ప్రదేశంలో రాత్రంతా అక్కడ తొక్కను ఉంచడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి. తేమ, దురద నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. సోరియాసిస్ చికిత్సకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్కలో ఫినోలిక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇంకా వీటిలో కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. అరటితొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి అరటి తొక్కలు ఆరోగ్యం, సౌందర్య సాధనాల కోసం సహజ ఉత్పత్తుల ప్రతిపాదకులు అరటి తొక్కను హెయిర్ మాస్క్‌లో ఒక పదార్ధంగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. దంతాలు తెల్లబడటానికి అరటి తొక్కలు అరటి తొక్కను దంతాల రుద్దడం వలన దంతాలకు చిగుళ్లకు మంచిదని మరికొన్ని అధ్యయనాలు ఒక వారం రోజుల పాటు ప్రతిరోజూ అరటి తొక్కతో పళ్లు రుద్దుకుంటే దంతాలు తెల్లబడతాయి. అలాగే నుదిటిపై అరటిపండు తొక్కను ఉంచితే తలనొప్పి తగ్గుతుంది. లెదర్ బూట్లు, వెండి వస్తువులను అరటి తొక్కలతో రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి. మొక్కలకు ఎరువుగానూ అరటి తొక్కలు ఉపయోగపడతాయి. వాడేసిన అరటి తొక్కలను నీటిలో వేసి నానబెట్టాలి. ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇది మొక్కలకు బలంగా పెరగడానికి దోహదపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -