Green Banana: పచ్చి అరటిపండుతో కలిగే లాభాలు ఇవే?

Green Banana: సంవత్సరంలో ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ అరటి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. అరటి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఎక్కువ శాతం పండిన అరటి పండ్లను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆకుపచ్చని రంగులో ఉన్న అరటి పండ్లు అంటే పచ్చి అరటిపండ్లలో అనేక రకాల అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. వచ్చి అరటిపండును ఎక్కువగా చిప్స్, లేదా కూర చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.

మరి పచ్చి అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా పండిన అరటిపండ్లతో పోలిస్తే పచ్చి అరటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో పండిన అరటిపండ్ల కంటే ఎక్కువ స్టార్చ్ ఉంటుంది. చక్కెర కూడా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల, పచ్చి అరటిపండు మధుమేహం రక్తపోటు రోగులు ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. అంతేకాకుండా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి పచ్చి అరటి పండ్లు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇవి బరువును తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే వారానికి కనీసం 2 లేదా 3 సార్లు పచ్చి అరటిపండు తినాలి.

 

ఉడికించిన పచ్చి అరటిపండ్లు చాలా తక్కువ కేలరీల కంటెంట్ అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటాయి. కనుక దీనిని తినడం ద్వారా మీ శరీరం కాల్షియంను బాగా గ్రహిస్తుంది. అందువల్ల, పచ్చి అరటి కూరగాయలను తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పచ్చి అరటిపండు విరేచనాలను తగ్గిస్తుంది. పచ్చి అరటిపండు తీసుకోవడం వల్ల అతిసారంలో త్వరగా ఉపశమనం లభిస్తుంది. వాస్తవానికి, అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి. అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. అందువల్ల, దీనిని ఉపయోగించడం వల్ల అతిసారం, వాంతుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే దీర్ఘకాలిక రుగ్మతలను నివారిస్తుంది. పచ్చి అరటిపండు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. అరటిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా, అరటిలోని పెక్టిన్ మలబద్ధకం కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదే సమయంలో శరీరంలో ఇన్సులిన్ నిర్వహిస్తుంది. అంతే కాకుండా, పచ్చి అరటిపండ్లలో విటమిన్ బి 6, విటమిన్ సి, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -