Poverty: ఇంట్లో నిత్య దరిద్రానికి అసలు కారణాలివే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే దరిద్రం దూరమంటూ?

Poverty: మామూలుగా చాలామంది ఎంత కష్టపడినా ఎన్ని రకాల పూజలు వ్రతాలు నోములు దానధర్మాలు చేసిన కూడా ఆర్థిక ఇబ్బందులు పట్టిపీడిస్తున్నాయని తెగ బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకపోగా అదనంగా అప్పు చేయాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పరిహారాలు పూజలు పాటిస్తూ ఉంటారు. అయితే ఎన్ని చేసినా కూడా వాస్తు ప్రకారంగా సరిగా లేకపోతే అవి కూడా మనం పడుతున్న బాధలకు ఒకింత కారణం కావచ్చు.

ప్రతిరోజు మనం ఉపయోగించే మంచం, పక్క బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మంచాన్ని ఉదయం మాత్రమే, శుభ్రపరచుకోవాలి. రాత్రిళ్ళు శుభ్రపరచడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే, బాత్రూమ్ ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూం శుభ్రంగా లేకపోతే దరిద్రం పట్టుకుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది ఎక్కువ ఆహారాన్ని పెట్టుకొని, వదిలేస్తూ ఉంటారు. అలా ఆహారాన్ని పారేయడం వలన దరిద్రం ఉంటుంది. ఇంటికి ఉత్తరం వైపు నల్లటి వస్తువులు ఉండటం వలన నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది.

 

ఎక్కడపడితే అక్కడ ఉమ్ము వేయకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. దరిద్రం తాండవిస్తుంది. అలాగే సాయంకాలం అనగా సూర్యాస్తమయం సమయంలో ఇల్లు తుడవకూడదు. ఇలా చేయడం వలన కూడా దరిద్రం పట్టుకుంటుంది. మద్యపానీయాలు ఇంట్లో పెట్టకూడదు. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో భార్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. భర్త బయటకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది అడగకూడదు. పనిలో ఆటంకం కలుగుతుంది. బయట నుండి ఏ విధంగా అయినా డబ్బులు వస్తే, మీ భార్య చేతికి ఇచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోవాలి. వయసులో ఉన్న ఆడపిల్లలు కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. అలానే గాజులు వేసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -