Pawan Kalyan: చంద్రబాబు పరువు పోయేలా చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?

Pawan Kalyan: ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ పై టీడీపీ అలాగే జనసేన పార్టీలు విమర్శలు గుప్పించడం సెటైర్లు వేయడం అన్నది కొత్తేమీ కాదు. ఇప్పటికే ఒక పార్టీ మీద మరొక పార్టీ సెటైర్లు వేసుకోవడంతో పాటు విమర్శలు సైతం గుర్తుంచుకున్నారు.. అయితే ఎప్పుడు కూడా టీడీపీ,జనసేన ఒకటి అయ్యి వైసీపీని విమర్శిస్తూ ఉంటారు. కానీ తాజాగా మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా టీడీపీమీ విమర్శిస్తూ చంద్రబాబు అసమర్థతపై విమర్శలు గుప్పించారు.

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతటి ప్రజా వ్యతిరేక పాలన సాగించాడో, ఎలాంటి అసమర్థుడు అన్నది పవన్ కళ్యాణ్ తాను స్వయంగా వివరిస్తే అది కచ్చితంగా ముఖ్యమైన వార్త అవుతుంది. అప్పట్లో ఆయన చంద్రబాబు అసమర్ధత మీద అనేక రకాల విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఓటమి అనుభవంలోకి వచ్చి తత్వం బోధపడిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఏ చంద్రబాబు ప్రాపకం ద్వారా అయితే తాను ఒకసారైనా ఎమ్మెల్యే కావాలని కలగంటున్నాడో ఆ చంద్రబాబు గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు పవన్. తాజాగా భీమవరంలో నిర్వహించిన సభలో పవన్ చాలా మాట్లాడారు.

 

ఆక్వా పరిశ్రమ వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పటికీ స్థానికంగా కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుందని, కాలుష్యం తగ్గిస్తూ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని తాను చాలా ఏళ్లుగా మాట్లాడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీనిపై గత ప్రభుత్వంతో కూడా పోరాడాను అని ఆయన తెలిపారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ వలన పరిసర గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో పవన్ దానికి వ్యతిరేకంగా పోరాడిన మాట వాస్తవమే. అయితే చంద్రబాబు ఆయన పోరాటం మీద ఏమాత్రం స్పందించకుండా తన అసమర్ధ పాలనా వైఖరిని ప్రదర్శించిన మాట కూడా నిజమే. తుందుర్రు ఆక్వా పార్క్ కు సంబంధించి జగన్ మాట నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్న పవన్, చంద్రబాబు చేసిన ద్రోహాలు గురించి మాత్రం ఈ సమయంలో చాలా కన్వీనియంట్ గా మరచిపోతున్నారు. ఒకవైపు చంద్రబాబు అసమర్ధత, దుర్మార్గ పాలనలను ఇంకా రచ్చ కీడుస్తూనే తాను ఆయన పల్లకి మోయడానికి ఎగబడుతూ ఉండడం విచిత్రంగా ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -