Maruthi: మారుతి పెళ్లి జరగడానికి ఆ డైరీ కారణమా.. ఏం జరిగిందంటే?

Maruthi: తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డైరెక్టర్ మారుతి ఎక్కువ శాతం కామెడీ తరహా సినిమాలను తెరకెక్కించారు. తన సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే దర్శకుడు మారుతీ తన భార్య స్పందనతో కలిసి అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వారి జీవితంలో జరిగిన మధురమైన అనుభూతుల గురించి పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్క డైరీ వల్ల ఇంట్లో దొరికిపోయాము.

ఎవరైనా ముందు అమ్మాయిని కలిసి వాళ్ల తల్లిదండ్రులను కలుస్తారు.. కానీ మీరు అలా చేయలేదట? అని యాంకర్ ప్రశ్నించగా ఆ విషయంపై మారుతీ స్పందిస్తూ.. బందర్‌లో జూనియర్‌ జేసీ వింగ్‌ అని ఒక క్లబ్‌ ఉండేది. అందులో స్పందన వాళ్ల అమ్మగారు చాలా చురుగ్గా ఉండేవారు. అలా మొదట ఆవిడ పరిచయమయ్యారు. ఒకసారి అందరం కలిసి డిన్నర్‌కు వెళ్లాం. అక్కడ స్పందనని తొలిసారి చూశాను. స్వీట్స్‌ తీసుకువచ్చింది. అప్పుడు తను పదోతరగతి చదువుతోంది. వీళ్ల స్కూల్‌ పక్కనే నేను స్టిక్కరింగ్‌ షాప్‌ ప్రారంభించాను. అప్పుడు మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనని ప్రేమిస్తున్నాను అని డైరెక్ట్‌గా చెప్పలేదు. తనంటే ఇష్టం అని తెలిసేలా చేశాను.

 

ఎందుకో చూడగానే నచ్చారు. ఎనిమిదో తరగతిలో ఆయన ఫేస్‌ నచ్చింది. తొమ్మిదో తరగతిలో టాలెంట్‌ నచ్చింది. టెన్త్‌కు వచ్చేసరికి ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయారు నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మొదట ఎవరు ప్రపోజ్ చేశారు అని యాంకర్ ప్రశ్నించగా.. మా మధ్య ప్రపోజ్ చేయడాలు లేవు ఇష్టమని చెప్పాను అంతే. తర్వాత నేను హైదరాబాద్‌ వచ్చేశాను. స్పందన వాళ్లు విజయవాడ వెళ్లారు. ప్రతి విషయాన్ని డైరీలో రాయడం తనకు అలవాటు. చక్కగా నేను ఏరోజు కలిశాను. ఏరోజు ఏం మాట్లాడాను. మొత్తం వివరంగా రాసేసింది. అది ఒకరోజు వాళ్లింట్లో వాళ్లు చూశారు. నేను కష్టపడే విధానం అన్నీ చూసి వాళ్ల అమ్మ నాకు ఫోన్‌ చేశారు. స్పందన డిగ్రీ అయిపోయాక మా ఇద్దరి కుటుంబాల్లో అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నాము అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ మారుతి. కానీ మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చివరికి డైరీలో మాత్రం పలానా టైంకి ఫోన్ చేయడానికి వెళ్లాను అని రాసేది చెబుతూ నవ్వులు పూయించారు మారుతి. ఆ డైరీ మీ దగ్గర ఉందా అని యాంకర్ ప్రశ్నించగా ఉంది అని సమాధానం ఇచ్చింది స్పందన.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -