Laya: పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన లయ.. ఏమైందంటే?

Laya: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో సందడి చేసిన నటి లయ. అప్పట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా.. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక డాన్స్ వీడియోతో బాగా సందడి చేస్తూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది లయ.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా తన వ్యక్తిగత విషయాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకుంది. లయ తన పెళ్లికి పవన్ కళ్యాణ్, చిరంజీవి లను ఆహ్వానించినట్లు తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ తన పెళ్లికి రావడం, ఆయన వినయ పూర్వకమైన ప్రవర్తనం చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది.

 

అంతేకాకుండా ఆయన తనకు తెలియకుండానే తన వివాహ రిసెప్షన్ కు ఎలా హాజరయ్యారన్న విషయాన్ని కూడా పంచుకుంది. ఇక తనను రాజకీయం గురించి యాంకర్ ప్రశ్నించగా.. తనకు రాజకీయ పట్ల అంతగా అవగాహన లేదు అని తెలిపింది. ఇక సీఎం కుర్చికి సరైన అభ్యర్థి ఎవరు అని యాంకర్ అడగటంతో పవన్ కళ్యాణ్ అని నేరుగా చెప్పేసింది.

 

అది ప్రజలే నిర్ణయిస్తుంది అని.. ఆయన సీఎం అయినా కాకపోయినా.. ఆయన ఎప్పటికీ ఉన్నత స్థానంలోనే ఉంటారు అని తెలిపింది. ఇప్పటికీ ఆయన చాలా గౌరవనీయుడు, ప్రముఖ నటుడు అని పేర్కొంది. ఇక చిరంజీవితో కలిసి పని చేయడానికి తనకు ఆసక్తి ఉందంటూ తెలిపింది. అయితే ఆమె పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే చరిష్మా ఉందని చెప్పటంతో ఆయన అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -