Pawan: కర్ణాటక ప్రచారం విషయంలో పవన్ షాకింగ్ షరతులు.. ఏమైందంటే?

Pawan: భారతీయ జనతా పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ ను భాగస్వామ్యం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో జనతా పార్టీ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ మద్దతు కావాలి అంటే బిజెపి నేతలే స్వయంగా వెళ్లి పవన్ ను కలవాల్సి ఉంది.

కానీ పవన్ ని బీజేపీ నేతలు ఢిల్లీకి పిలిపించుకుని మద్దతు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన్ కర్ణాటక ప్రచారంలో పాల్గొనాలి అంటే కొన్ని కండిషన్ లు ఉన్నట్లుగా కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఏపీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని క‌లుపుకుపోవాల‌నే త‌న కోరిక‌ను ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా బ‌య‌ట పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎలాగూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఎలాగైనా చంద్ర‌బాబును సీఎంగా చూసుకోవ‌డానికి ప‌వ‌న్ ప‌రితపిస్తున్నారు.

 

ఇప్పటికే పవన్ టిడిపిని కలుపుకుపోవడం పట్ల బీజేపీ అధినాయకుల మధ్య ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బాబుని సీఎంగా చూసుకోవాల‌న్న ఆరాటం ప‌వ‌న్ కు ఉన్న, బీజేపీకి మాత్రం అంత ఆస‌క్తి లేదు. బీజేపీ వాళ్లు త‌న‌ను క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం అని పిలిస్తే చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న‌ను ప‌వ‌న్ తీసుకు వ‌చ్చార‌ని, ఏపీలో టీడీపీ పార్టీని క‌లుపుకోవాల‌నే ప్ర‌తిపాద‌న‌ను ఈ సంద‌ర్బంగా తెచ్చాడంటే బాబు పై ప‌వ‌న్ కి ఉన్న మ‌మకారం గురించి అర్థం చేసుకోవ‌చ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -