Pawan Kalyan: పవన్ కు జ్వరం వస్తే వైసీపీకి వణుకు.. మరీ ఇంత నీచ ఆరోపణలా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈయనకు తీవ్రమైనటువంటి జ్వరం రావడంతో తన ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా ఎండలో తిరిగి తీవ్రమైనటువంటి జ్వరం బారిన పడటంతో ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని వైసీపీ పెద్ద ఎత్తున రాజకీయం చేస్తోంది.

రెండు రోజులపాటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నందుకే జ్వరం వస్తే మరి పెన్షన్ కోసం అవ్వ తాతలు మండుటెండలో సచివాలయాల వద్దకు వెళ్లి ఎలా పెన్షన్ తీసుకుంటారు అంటూ ప్రశ్నించారు. నిజానికి ఏప్రిల్ ఒకటవ తేదీ ఆర్థిక సంవత్సరం కావడంతో బ్యాంకులకు సెలవు ప్రభుత్వం నుంచి బ్యాంకుకు నగదు ఆలస్యంగా రావడంతో పింఛన్ పంపిణీ కూడా ఆలస్యమైందంటూ తమ సాక్షి పేపర్ లోనే ప్రచురించుకున్నారు.

ఇలా పెన్షన్ ఆలస్యం అవ్వడానికి గల కారణమేంటనేది అందరికీ తెలుసు కానీ దీనిని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయాలు చేయుట ఒక వైసీపీకి మాత్రమే చెల్లుబాటు అవుతుందని జనసేన కూటమి కార్యకర్తలు నేతలు వైసిపి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు.

ఇప్పటికే పిఠాపురంలో వార్ వన్ సైడ్ అయింది తప్పకుండా పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈయన ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం తనకు అస్వస్థతగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారానికి వచ్చారు అప్పటికి వైద్యులు వద్దని చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంటింటికి ప్రచారం చేశారు. దీనితో ఎక్కువ జ్వరం రావడంతో విశ్రాంతి తీసుకున్నారు.

ఇలా ఆయన జ్వరంతో బాధపడుతూ ఉంటే వైసిపి మాత్రం విష ప్రచారం చేస్తుంది. రెండు రోజులకే తనకు చేతకాలేదని జ్వరం పేరు చెప్పి హైదరాబాద్ కి వెళ్లి సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు అంటూ విష ప్రచారానికి తెర లేపింది .ఒకవైపు పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతూ ఉంటే మరోవైపు వైసీపీకి ఆయన గెలుపును చూసి వెన్నులో వణుకు పుడుతుందని స్పష్టంగా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -