Charan: చరణ్ పాత్రను బుచ్చిబాబు అలా చూపిస్తారా.. ఏం జరిగిందంటే?

Charan: ‘ ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా ప్రత్యేకమైనదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రముఖ బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి రియల్ లైఫ్ స్టోరీని ఆధారంగా తీసుకొని బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం.

 

వైజాగ్ లోని వీరఘట్టం గ్రామానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు రెజ్లర్ గా బాడీ బిల్డర్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఇండియన్ హెర్క్యూలెస్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే కోడి రామ్మూర్తి నాయుడు సాహసాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలను ఆధారంగా చేసుకుని కొంత ఫిక్షన్ జోడించి బుచ్చిబాబు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

 

ఇక ఈ సినిమాలోని ఇంటర్వెల్, క్లైమాక్స్ లలో చరణ్ పాత్రలకు సంబంధించి షాకింగ్ ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఇలా చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు తన రెండవ సినిమా కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -