Ram Charan: ఆ డైరెక్టర్ తో చరణ్ సినిమా తీయకపోవడానికి ఆయనే కారణమా?

తెలుగు ప్రేక్షకులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.

అలా చరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతేకాకుండా హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కొంతవరకు రామ్ చరణ్ క్రేజ్ సెగ తగిలినట్లు తెలుస్తుంది. ఇక చరణ్ తన నెక్స్ట్ మూవీ జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

కానీ దాదాపు కొంతకాలం నుంచి ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ రావడం లేదు. ప్రస్తుతం గౌతమ్ ఈ సినిమాను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కానీ దీనికి పూర్తి కారణమైతే తెలియలేదు. కానీ ఈ సినిమా కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. గౌతమ్.. చరణ్ ను ఈ సినిమా కోసం ఒప్పించి తన తండ్రి చిరంజీవికి స్క్రిప్ట్ చెప్పమని తెలిపాడట.

కానీ గౌతమ్ స్క్రిప్ట్ మెగాస్టార్ ను ఏమాత్రం ఒప్పించలేక పోయిందట. దాని కారణంగా చిరంజీవి వెంటనే సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆ స్క్రిప్టు మెగాస్టార్ ని అంతగా మెప్పించకపోవడం వలన ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టారట. మరి ఈ విషయం గురించి గౌతమ్ ప్రేక్షకులకు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆర్ సీ 15 ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -