Jr NTR-Ram Charan: ఎన్టీఆర్ చరణ్ మధ్య గొడవ.. అందుకే పేరు చెప్పట్లేదా?

Jr NTR-Ram Charan: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ దాస్ క ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా విచ్చేశాడు. ఆస్కార్ అవార్డుల వేడుక తర్వాత ఎన్టీఆర్ హాజరైన మొదటి ఈవెంట్ ఇదే. ఈ వేడుకలో ఎన్టీఆర్ ఆస్కార్ అనుభవాలను తెలిపాడు. తన అనుభవాలను చెబుతూ తనతో ఆర్ఆర్ఆర్ లో నటించిన రామ్ చరణ్ గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచపటంలో నిలబడిందంటే, ఆస్కార్ అవార్డును చేజిక్కించుకుంది అంటే..ఇలా మాట్లాడుకుంటూ పోయారే గానీ ఎక్కడా కూడా రామ్ చరణ్ గురించి ప్రస్తావించలేదు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో జక్కన్న రాజమౌళి ఎంత కారణమో, కీరవాణి, చంద్రబోస్ కారణమో, అలాగే పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ వీరితో పాటుగా యావత్ తెలుగు చిత్రసీమ కూడా అంతే కారణం అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు.

 

ఆ అవార్డు సాధించడానికి అసలు కారణం అభిమానులేనని, ఫ్యాన్స్ అందరి తరపున తాము ఆస్కార్ వేదికపై నిలబడగలిగామని, కీరవాణి, చంద్రబోస్ ను చూస్తుంటే భారతీయులను చూసినట్లు అనిపించిందని, వాళ్లలో తెలుగుతనం నిండి ఉందని ఎన్టీఆర్ అన్నారు. అలాగే ఆస్కార్ అవార్డు రావడానికి అందరితో పాటు ముఖ్య కారణం మీడియా ప్రతినిధులని అన్నారు.

 

తెలుగు సినిమా అయిన ఆర్ఆర్ఆర్ ను మీడియా ప్రతినిధులు ప్రమోట్ చేయడం వల్లే ఇంతటి ఘనత సాధించిందన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఎన్టీఆర్ అందరి గురించి మాట్లాడినా చరణ్ గురించి చెప్పకపోవడం మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. ఆస్కార్ అవార్డు వచ్చిరోజు కూడా ఎన్టీఆర్ చరణ్ పేరును ట్యాగ్ చేయలేదు. దీంతో ఎన్టీఆర్ కు ఇన్సెక్యూరిటీ పెరిగిపోయిందని, చరణ్ తో విబేధం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -