Vijay-Sam: విజయ్ సామ్ బట్టలిప్పి తిరిగితే సినిమా ఆడుతుందా.. నెటిజన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Vijay-Sam: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా విజయ్ దేవరకొండ,సమంత పేర్లు మారుమవుతున్నాయి. అందుకు గల కారణం తాజాగా వీరిద్దరు చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్. విజయ్ దేవరకొండ,సమంత కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విజయ్ దేవరకొండ సమంత ఇద్దరు కలిసి స్టేజి పర్ఫామెన్స్ ను ఇరగదీశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సమంతను ఎత్తుకోవడంతో పాటు షర్ట్ విప్పేసి ఫుల్ రొమాంటిక్ డాన్స్ చేశారు.

 


దీనితో సమంత విజయ్ దేవరకొండ అభిమానులు ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తుండగా అక్కినేని నాగచైతన్య అభిమానులు, నేటిజన్స్ మాత్రం సమంతా పై విజయ్ దేవరకొండపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలా డాన్స్ చేయడం అవసరమా అంటూ మండిపడుతున్నారు.
కాగా ఒక నెటిజెన్ విజయ్ దేవరకొండ ఖుషి కాన్సెర్ట్ లో చేసిన డాన్స్ పై ఈ విధంగా స్పందించాడు. సినిమా ఆడాలంటే సమంతా విజయ్ దేవరకొండ లా స్టేజ్ మీద బట్టలిప్పి తిరగాల్నా? అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ విజయ్ సమంతకి చురకలు అంటించాడు.

 

అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాల కామెంట్స్ చేశారు. బలగం సినిమా బట్టలిప్పి తిరిగితే ఆడిందా?కాంతారా మూవీలో ఏ కాంతని చూసి హిట్ చేశారు ? నిన్న కాక మొన్న వచ్చిన జైలర్ లో హీరోకి ఏ సిక్స్ ప్యాక్ ఉంది? ప్రేక్షకుల్ని అంత తక్కువ అంచనా వేయకండి. కథలో కంటెంట్ ఉండాలి. నటన తెలియాలి. సినిమాని సినిమాలా తీయాలి. బనియన్ లు ఏసుకుంటే ఎగేసుకొని చూస్తారనుకోవడం మీ భ్రమ. బట్టలేసుకోవడమే రానోళ్ళు బ్లాస్ట్ అవడం తప్ప బ్లాక్ బస్టర్లు కాలేరు. కాగా సదరు నెటిజన్ చేసిన కామెంట్లకు చాలామంది స్పందిస్తూ సూపర్ గా చెప్పారు బ్రదర్ అని కొందరు కామెంట్స్ చేయగా మరి కొందరు సదరు నిటిజెన్ పై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -