Marriage: చిన్న వయస్సు ఉన్న అమ్మాయిని చేసుకుంటే అలాంటి సమస్యలు వస్తాయా?

Marriage: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన అంశమని చెప్పాలి. అయితే పెళ్లి చేసుకోవాలనుకునేవారు అబ్బాయిలు అమ్మాయిలు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు ప్యాకేజ్ ఎంత అనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు అయితే ఈ మధ్యకాలంలో వయసు తేడాలను కూడా గమనిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు.ఒకానొక సమయంలో చాలా వయసైన అబ్బాయికి చిన్న వయసు గల అమ్మాయిని పెళ్లి చేసేవారు అయితే ప్రస్తుతం మాత్రం అమ్మాయిలు తనకన్నా ఐదు సంవత్సరాల వయసులో పెద్దవాడు అయితేనే తమకన్నా పెద్దవాడు అనే ఫీలింగ్ లో ఉంటున్నారు.

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తూ మంచి సాలరీ తీసుకుంటున్నారు కనుక తమకు వచ్చేవాడు కూడా అంతకుమించి సంపాదన ఉండేవారు కావాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోని తమ కన్న ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్దవాడైతే పర్లేదు కానీ మరి ఐదు సంవత్సరాలు అయితే వద్దు అనే ధోరణిలోనే ఉన్నారు.ఇలా వయసులో ఐదు సంవత్సరాలు పెద్దవాడైతే పర్వాలేదు కానీ అమ్మాయి కన్నా అబ్బాయి వయసు పది సంవత్సరాలు పెద్దదైతే మాత్రం అసలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 

ఇలా అబ్బాయికి వయసు 30 దాటి అమ్మాయికి అప్పుడప్పుడే 20 ఏళ్లలోకి పడుతుంటే కనుక వారిద్దరి మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.వయసులో పది సంవత్సరాలు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి సెక్స్ పరంగా తనతో చాలా హ్యాపీగా ఉంటారు అందులో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పని ఉండదు.అయితే వయసులో పెద్దవాడైనటువంటి అబ్బాయి వయసు తక్కువగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల తన దృష్టిలో అమ్మాయి పరిణితి చెందని అమ్మాయిగానే భావిస్తారు.

 

ఇలా ఏ విషయం గురించైనా నీకేం తెలుసు? సమాధానం చెప్పే అంత పెద్ద దానివా? అనే ప్రశ్నలు వేస్తుంటారు. అయితే అబ్బాయి ఇలాంటి ప్రశ్నలు వేయడంతో అమ్మాయిలో ఎక్కడో చిన్నపాటి అసంతృప్తి ఉంటుంది. తనకు చాలా వయసున్న వ్యక్తితో పెళ్లి చేశారన్న ఆలోచన ఒక్కసారి తన మనసులో పడింది అంటే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిలు తమ కన్నా వయసులో ఐదు సంవత్సరాల వరకు పెద్ద వాడిని పెళ్లి చేసుకున్న పర్లేదు కానీ మరీ పది సంవత్సరాలు వయసు పెద్ద అంటే చేసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -