CM Jagan: తల్లిని గెంటేసిన సంగతి జగన్ మరిచాడా.. ఆమె అండ లభించడం సాధ్యమవుతుందా?

CM Jagan: కాలం చాలా గొప్పది అంటారు. అందుకే.. ఇవాళ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నా.. రేపటికి ఎలా ఉంటాయో తెలియదు. ఈ విషయం ఏపీ సీఎం జగన్ జీవితాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఆయన గెలుపునకు చాలా మంది కృషి చేశారు. తల్లి విజయలక్ష్మీ, చెల్లి షర్మిల, బావ అనిల్ తో పాటు.. ఐ ప్యాక్ సంస్థ కూడా వైసీపీ విజయంలో భాగం అయ్యాయి. అయితే గిర్రున ఐదేళ్లు తిరిగే సరికి పరిస్థితులన్నీ మారిపోయాయి. తల్లిని వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు. చెల్లితో ఆస్తి వివాదాలు పెట్టుకున్నారు. చెల్లితోనే బావ కూడా దూరం అయ్యారు. ఐప్యాక్ సంస్థ జగన్‌తో ఉన్నా.. ప్రశాంత్ కిషోర్ వైసీపీకి చెవి దగ్గర జోరీగలా మారారు. కాబట్టి గతంలో అనుకూలంగా ఉన్న పరిస్థితులన్నీ ఇప్పుడు వైసీపీకి ప్రతికూలంగా మారాయి.

అన్నింటికంటే ముఖ్యంగా వివేకాహత్య కేసు వైసీపీ గెలుపును సవాల్ చేస్తున్నట్టు తయారైంది. గత ఎన్నికల్లో వివేకాహత్యనే జగన్ ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. ఇప్పుడు అదే ప్రతికూలంగా మారింది. ఈ కేసును చేధించాల్సింది పోయి.. ఆ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాష్కర్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న వైఎస్ సునీతపై ఆరోపణలు చేస్తున్నారు. ఆస్తి కోసం తండ్రిని హత్య చేయించిందని విమర్శిస్తున్నారు. అయితే, రాయలసీమ ప్రజలకు నిజం తెలుసు కనుక జగన్ పై ఎన్నికల్లో తిరుగుబాటు తప్పదనే వార్తలు వస్తున్నాయి. దీంతో.. జగన్ చివరి అస్త్రంగా తన తల్లిని ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వై నాట్ 175 అని జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. లో లోపల ఓటమి భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకే విజయమ్మను మళ్లీ వైసీపీలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. విజయమ్మ వైసీపీకిలోకి వస్తే.. తనపై వస్తున్న అన్ని విమర్శలకు సమాధానం దొరుకుతోందని జగన్ భావిస్తున్నారు.

అయితే, జగన్ ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. అవి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో తెలియదు. మొదట విజయమ్మను పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు. ఇప్పుడు అవసరం ఉందని ఆమెను పిలిస్తే వెళ్తారా? అనేది అనుమానమే? ఒకవేళ మరోసారి వెళ్లినా… మళ్లీ అలాగే బయటకు పంపేయరు అనే గ్యారెంటీ కూడా లేదు. అన్నింటికి మించి.. షర్మిలపై చేస్తున్న విమర్శలను కూడా విజయమ్మ పరిగణలోకి తీసుకుంటారు. షర్మిలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పదవి కోసం, డబ్బు కోసం గత ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భవిష్యత్‌లో విజయమ్మపై కూడా అలాంటి ఆరోపణలు చేయరన గ్యారెంటీ ఏముంది? ఇక.. షర్మిల వైఎస్ జగన్, రాజశేఖర్ రెడ్డి పాలనకు తేడాలు చెబుతూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు విజయమ్మ వైసీపీ కోసం రంగంలోకి దిగితే.. రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ గొప్పగా పరిపాలిస్తున్నారని చెబుతారా? అనేది చూడాలి. అన్నింటి కంటే ముందు.. మితి మీరిన వైసీపీ నేతల విమర్శలు పరోక్షంగా విజయమ్మను కూడా తాకాయి. వైఎస్ ఫ్యామిలీతో షర్మిలకు సంబంధం లేదని సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేసింది. అంటే దానర్థం విజయమ్మను తప్పుగా చిత్రీకరించినట్టే కదా? అని కూడా పలువురు మండిపడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని విజయమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జగన్ విశ్వ ప్రయత్నాలు చేసినా.. విజయమ్మ వైసీపీ కోసం ప్రచారం చేయరు అని చాలా మంది భావిస్తున్నారు. వైసీపీకి కోసం ప్రచారం చేస్తే.. అనివార్యంగా షర్మిలను విమర్శించాల్సి ఉంటుంది. జగన్ వ్యక్తిత్వాన్ని చూసిన విజయమ్మ ఆయన కోసం సొంత కుమార్తెను విమర్శిస్తారని ఎవరూ అనుకోరు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -