CM Jagan: జగన్ జమానాలో పారిశ్రామిక రంగం సర్వనాశనం.. రాష్ట్రంలో పరిస్థితి ఇంత ఘోరమా?

CM Jagan: మా రాష్ట్రం పరిశ్రమలకు స్వర్గధామం. పరిశ్రమలకు అన్ని అనుమతులు 15 రోజుల్లోనే ఇస్తాం. సహజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. చెప్పడమే కాదు.. అలాంటి పరిస్థితులను కూడా తయారు చేస్తారు. ఎందుకంటే పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు పెరిగితే.. రాష్ట్రం అభివృద్ది చెందితే సదరు నాయకుడికి మంచి పేరు వస్తుంది. అంతేకాదు.. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది.

అయితే, ఏపీ సీఎం జగన్ స్టైలే వేరు. ఒక రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ఆ రాష్ట్రానికి బ్రాంబ్ వేల్యూ ఉండాలి. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వంపై విశ్వసనీయత పెరగాలి. అప్పుడే పెట్టుబడులు పెడతారు. కానీ.. ఏపీకి గతంలో ఉన్న బ్రాండ్ వేల్యూని ప్రభుత్వం మార్చేసింది. ఏపీ అంటే పారిశ్రామిక వేత్తలు బయపడేలా చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజునుంచే పారిశ్రామికవేత్తలకు భయం పుట్టేలా చేసింది. మొదట విద్యుత్ పీపీఏ సమీక్షల పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అంటే.. విద్యుత్ పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంది. ఒకవేళ గత ప్రభుత్వం తప్పు చేస్తే ఆయా నేతలపై చర్యలు తీసుకోవాలి. కానీ, గతంలో జరిగిన ఒప్పందాలు రద్దు చేసుకుంటే.. ప్రభుత్వాలు మారని ప్రతీసారి పారిశ్రామిక ఒప్పందాలు రద్దు అవుతాయనే సంకేతం వ్యాపారవేత్తల్లోకి వెళ్తుంది. దీంతో ఎవరూ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందడుగు వేయరు. ఏపీలో అదే జరిగింది.

అంతేకాదు.. గత ప్రభుత్వం పలు కంపెనీలు కు కేటాయించిన స్థలాల విషయంలో కూడా అదే తరహాలో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. భూముల సమీక్ష పేరుతో పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేసింది. దీంతో.. గతంలో ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు చేసుకునున్న కంపెనీలు లక్ష 24 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. ఆ తర్వాత ఏపీలో పెట్టుబడి పెట్టాలంటే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు వణుకుపుడుతుంది.

ఏపీలో నుంచి అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ తెలంగాణకు తరలి వెళ్లి అక్కడ రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. కొన్ని దశాబ్దాలుగా ఏపీ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న అమరరాజా కంపెనీ పక్కరాష్ట్రానికి తరలిపోయిందంటే పరిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి జగన్ ప్రభుత్వం ఏపీకి పెట్టుబడుల వరద అంటూ తెగ ప్రచారం చేసింది. నిజంగానే పెట్టుబడులు వస్తే నిరుద్యోగులు ఎందుకు పెరుగుతారు?

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2022 ఆగస్టు వరకు రాష్టానికి రూ.46,280.53 కోట్ల పెట్టుబడులతో 99 భారీ కొత్త పరిశ్రమల ఏర్పాటయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. దాంతో పాటు రూ.39,655 కోట్లతో మరో 55 భారీ పరిశ్రమలు పలు దశల్లో ఉన్నాయని కూడా ప్రచారం చేస్తోంది. నిజానికి ఆ పెట్టబుడుల్లో మెజారిటీ పెట్టుబడులో గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు కుదుర్చున్నాయి. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత లక్షా 24 వేల కోట్ల రూపాయల పెట్టబడులు వెళ్లిపోగా మిగిలినవి ఇప్పుడు పలు దశల్లో ఇన్నాయి. కానీ, అది తమ క్రెడిట్ గా వైసీపీ చెప్పుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh-Murugudu Lavanya: మంగళగిరిలో సీన్ సితారే.. లోకేశ్ దెబ్బకు వైసీపీ లావణ్య సైలెంట్ అయ్యారా?

Nara Lokesh-Murugudu Lavanya: 2019 ఎన్నికలలో నారా లోకేష్ వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే...
- Advertisement -
- Advertisement -