YSRCP Leaders: ఫోన్ లాక్కొని ఈనాడు రిపోర్టర్ ను బెదిరించిన వైసీపీ నేతలు.. మరీ ఇంత ఘోరమా?

YSRCP Leaders: ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రోజురోజుకు పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తూ భారీగా డబ్బు పోగు చేసుకుంటున్నారు. ఇదేంటంటే ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో అక్రమ తవ్వకాలు చేపడుతూ వైకాపా నాయకులు అందరూ కూడా భారీగా లబ్ధి పొందారు అనే విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన అమరావతిలో చోటుచేసుకుంది.

అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తున్నటువంటి వైకాపా నాయకులకు సంబంధించిన ఫోటోలను ఈనాడు అమరావతి రిపోర్టర్ ఫోటోలు తీస్తూ ఉండగా ఆయనని బంధించి ఆయన దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని అతనిపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమరావతి విలేకరి పరమేశ్వర రావు పై ఈ దాడి జరిగింది.

మండలంలోని మల్లాది ఇసుక రీచ్ వద్ద బుధవారం అక్రమంగా ఇసుక తవ్వకాలను చేపట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలను చేస్తూ ఉండగా విలేకరి ఫోటోలు తీసారు అది గమనించడం వైకాపా నేతలు ఆయనని బంధించి తన దగ్గర నుంచి బలవంతంగా ఫోన్ లాక్కున్నారు. ఎన్జిటి ఆదేశాలు పట్టించుకోకుండా వైకాపా నేతలు ఈ తవ్వకాలు చేస్తున్నటువంటి తరుణంలోనే విలేకరి వాటిని ఫోటోలు తీశారు.

ఇలా ఆయనపై వైకాపా నేతలు దాడి చేశారని తనని బంధించారనే విషయం తెలుసుకున్నటువంటి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ ఘటన స్థలానికి పోలీసులను పంపించి బందీ అయినటువంటి విలేకరి పరమేశ్వర రావుని విడిపించారు. ఇలా అక్రమ తవ్వకాలకు పాల్పడితే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రశ్నించిన వారిపై దాడులు నిర్వహిస్తూ వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -