Chiranjeevi: చిరంజీవిపై విమర్శల దాడి.. ఆ అభిమానుల ఓట్లను వైసీపీ దూరం చేసుకుంటోందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చారు అయితే రాజకీయాలు తనకు సూటు కావని చెప్పినటువంటి ఈయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతు తెలుపుతూ వచ్చారు గత కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడమే కాకుండా తాను కూటమికి మద్దతు తెలుపుతున్నానని పరోక్షంగా తెలియజేశారు.

ఇలా తన తమ్ముడికి 5 కోట్ల విరాళం ఇచ్చినటువంటి చిరంజీవి ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు కానీ ఇటీవల సీఎం రమేష్ , పంచకర్ల రమేష్ ఇద్దరు కూడా చిరంజీవిని కలిశారు అయితే ఈ సందర్భంగా ఈయన కూటమికి మద్దతు తెలుపుతూ గెలిపించాలని కోరారు. దీంతో వైసిపి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్సిపి పార్టీ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు అందరూ కూడా గత రెండు రోజులుగా చిరంజీవి పట్ల విమర్శలు చేస్తున్నారు. ఇలా చిరు పై విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డికి భీమవరం సభలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా అన్న జోలికి వస్తే అసలు సహించనని వార్నింగ్ ఇచ్చారు.

ఈ విధంగా వైసీపీ నేతలు చిరంజీవి పట్ల విమర్శలు చేయడంతో చిరంజీవి అభిమానులుగా ఉన్నటువంటి వైసీపీ అభిమానుల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇలా వైఎస్ఆర్సిపి చిరు అభిమానులు కనుక వైసిపి కి ఓట్లు వేయకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేస్తే తనుకు ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే ఈ ఎన్నికలలో ఓటమిని అంగీకరించాల్సిందేనని పలువురు వైసిపి నేతలపై విమర్శలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -