Gudivada Amarnath: గుడివాడ గుడ్డు మంత్రికి గాజువాకలో భారీ ఝలక్.. సొంత వార్టీ వాళ్లే అవమానించారా?

Gudivada Amarnath: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే కొన్ని చోట్ల వైకాపా అభ్యర్థులకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇటీవల గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ టికెట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా గాజువాక నుంచి ఈయన పోటీకి దిగిన నేపథ్యంలో మొదటిసారి అక్కడ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు గైహాజరు కావడం గమనార్హం. ఈ సమావేశానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డి అలాగే ఇన్చార్జిగా వ్యవహరించినటువంటి ఉరుకూటి రామచంద్రరావు ఈ కార్యక్రమానికి గైహాజరు అయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పలువురు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు గుడివాడ అమర్నాథ్ ను వివిధ అంశాలపై ఆయనని ప్రశ్నించారు. దీంతో అమర్నాథ్ ప్రభుత్వ నిర్ణయాల మేరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీ విజయానికి దోహదం చేయాలి అంటూ ఈయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ విధంగా స్థానా బదిలీలను చేస్తూ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినప్పటికీ భారీ స్థాయిలో సొంత పార్టీ నుంచే అభ్యర్థులకు వ్యతిరేకత వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అమర్నాథ్ విషయంలోనే కాదు ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థుల విషయంలో ఇలాంటి వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో అభ్యర్థులందరూ కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -